Jr NTR: జూనియర్ ఎన్టీఆర్‌పై పిఠాపురం వర్మ సంచలన వ్యాఖ్యలు

గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్‌పై సోషల్ మీడియాలో ఎటువంటి వార్ జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. తెలుగు దేశం పార్టీపై తన స్టాండ్ ఏమిటో చెప్పాలని కొందరు, టీడీపీ తరపున ప్రచారం చేయాలని, వీడియో విడుదల చేయాలని.. ఇలా రకరకాలుగా ఆయనపై వార్తలు వైరల్ అయ్యాయి. తాజాగా జూనియర్ ఎన్టీఆర్‌పై పిఠాపురం వర్మ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.


గత కొన్ని రోజులుగా జూనియర్ ఎన్టీఆర్‌ (Jr NTR)పై సోషల్ మీడియాలో ఎటువంటి వార్ జరుగుతుందో అందరికీ తెలిసిన విషయమే. తెలుగు దేశం పార్టీ (TDP)పై తన స్టాండ్ ఏమిటో చెప్పాలని కొందరు, టీడీపీ తరపున ప్రచారం చేయాలని, వీడియో విడుదల చేయాలని.. ఇలా రకరకాలుగా ఆయనపై వార్తలు వైరల్ అయినప్పటికీ.. ఎన్టీఆర్ (NTR) మాత్రం ఏం స్పందించకుండా నిశ్శబ్దంగానే ఉన్నారు. అయినా కూడా ఆయనపై ఏదో రకంగా వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. తాజాగా పిఠాపురానికి (Pithapuram) చెందిన టీడీపీ నేత ఎస్‌విఎస్‌ఎన్ వర్మ (SVSN Varma) ఓ డిబేట్‌లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవడమే కాకుండా.. ఆయనపై తారక్ ఫ్యాన్స్ ఫైర్ అయ్యేలా చేస్తున్నాయి. ఇంతకీ వర్మ ఏమన్నారంటే..

‘‘రమ్మనండి ఎన్టీఆర్‌ని సినిమాలు మానేసి.. ఫుల్ టైమ్ రాజకీయాలలోకి. ఏదో ఒక పదవి ఇచ్చి కూర్చోబెడతాం. లోకేష్‌తో ఎన్టీఆర్‌కి పోలిక ఏముంది. నారా లోకేష్ సీన్సియర్‌గా పార్టీ కోసం పని చేస్తున్నారు. 60 లక్షల సభ్యత్వం చేశారు.. పార్టీ కోసం అహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు. కార్యకర్తలు ఎవరైనా చనిపోతే ఇన్సూరెన్స్ ఇచ్చే విధానాన్ని లోకేష్ (Nara Lokesh) అమలు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో ప్రస్తుతం లోకేష్ కీలకంగా మారారు. ఎవరైనా సరే రాజకీయంగా పార్టీ కోసం పని చేస్తే కచ్చితంగా గుర్తింపు వస్తుంది. పార్టీ కోసం త్యాగం చేసే ఉద్దేశ్యం ఉంటే జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు వదిలేసి రావాలని స్వాగతిస్తున్నాను. నందమూరి హరికృష్ణకు రాజ్యసభ ఇచ్చారు, నందమూరి బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాజకీయాల్లోకి రావాలని ఆ కుటుంబానికి లేని బాధ మిగతా వాళ్లకు ఎందుకు?’’ అని పిఠాపురం వర్మ (Pithapuram Varma Comments) ప్రశ్నించారు.

దీనిపై ఎన్టీఆర్ అభిమానులు (Jr NTR Fans) గరం గరం అవుతున్నారు. వర్మను ఉద్దేశించి అనేక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ కామెంట్స్‌తో ప్రస్తుతం వర్మ మరోసారి వార్తలలో హైలెట్ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. ఇంకొన్ని గంటలలో ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న వేళ సోషల్ మీడియాలో ఈ రచ్చ ఏంటని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం గమనార్హం.