జూలైలో వస్తు, సేవల పన్ను (జీఎ్‌సటీ) స్థూల ఆదాయం వార్షిక ప్రాతిపదికన 10.3 శాతం వృద్ధితో రూ.1.82 లక్షల కోట్లకు చేరుకుంది. జీఎ్‌సటీ చట్టం అమలులోకి వచ్చిన (2017 జూలై నుంచి) ఏడేళ్లలో ఇది మూడో అత్యధిక నెలవారీ వసూలు. గత నెలలో పన్ను రిఫండ్లు రూ.16,283 కోట్లుగా నమోదయ్యాయి. రిఫండ్లు మినహాయించగా.. నికర జీఎ్‌సటీ వసూళ్లు 14.4 శాతం వృద్ధితో రూ.1.66 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం జీఎ్‌సటీ ఆదాయం రూ.1,82,075 కోట్లలో సెంట్రల్ జీఎ్‌సటీ రూ.32,386 కోట్లు, స్టేట్ జీఎ్‌సటీ రూ.40,289 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎ్‌సటీ రూ.96,447 కోట్లుగా ఉన్నాయి. సెస్సు రూపంలో మరో రూ.12,953 కోట్లు సమకూరాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొదటి త్రైమాసికంలో జీఎ్‌సటీ ఆదాయం వార్షిక ప్రాతిపదికన 10.2 శాతం వృద్ధి చెంది రూ.7.39 లక్షల కోట్లకు చేరుకుంది.ఈ ఏడాది ఏప్రిల్‌లో జీఎ్‌సటీ వసూళ్లు ఆల్‌టైం రికార్డు స్థాయి రూ.2.10 లక్షల కోట్లకు పెరగగా.. 2023 ఏప్రిల్‌లో రెండో అత్యధిక స్థాయి రూ.1.87 లక్షల కోట్లుగా నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్ ఆదాయం రూ.3,346 కోట్లు
గత నెలకు తెలంగాణ జీఎ్‌సటీ ఆదాయం 2 శాతం పెరిగి రూ.4,940 కోట్లుగా, ఏపీ జీఎ్‌సటీ రాబడి 7 శాతం తగ్గి రూ.3,346 కోట్లుగా నమోదయ్యాయి.