వ్యాపారం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారా అయితే ఓ చక్కటి బిజినెస్ ప్లాన్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ లో చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది.
ఇందులో ముఖ్యంగా ఎక్కువ మొత్తంలో లాభం పొందవచ్చు. పైగా అన్ని సీజన్లోనూ ఫుడ్ బిజినెస్ కు మంచి డిమాండ్ ఉంటుంది. అలాంటి ఫుడ్ బిజినెస్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. పాప్ కార్న్ మేకింగ్ మెషీన్ ద్వారా చక్కటి ఆదాయం పొందే అవకాశం ఉంది. ముఖ్యంగా పాప్ కార్న్ తినేందుకు చిన్నాపెద్దా అందరూ ఇష్టపడుతుంటారు. సినిమా హాళ్లలోనూ, పార్కుల్లోనూ, బస్టాండ్ లు, రైల్వేస్టేషన్లో ఖాళీ సమయంలో తినేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే ఈ పాప్ కార్న్ బిజినెస్ లో లాభం పొందాలి అంటే ముందుగా పాప్ కార్న్ తయారీ గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. దీని రెండు పద్ధతుల్లో తయారుచేస్తారు ఒకటి నాటు పద్ధతి ఇందులో ఒక మూకుడులో మొక్కజొన్న గింజలను వేయించి పాప్ కార్న్ తయారు చేస్తారు. ఇక రెండో పద్ధతిలో పాప్ కార్న్ మెషిన్ ఉపయోగించి మొక్కజొన్న గింజలను వేడి చేసి పాప్ కార్న్ తయారు చేస్తారు. రెండో పద్ధతి కమర్షియల్ పద్ధతి ఇది సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా కమర్షియల్ పాప్ కార్న్ మెషిన్ ధర 20 వేల నుంచి ప్రారంభం అవుతుంది. కాస్త పెద్ద మొత్తంలో కొనుగోలు చేయాలంటే రూ. 30 వేల వరకు పెట్టవచ్చు.
పాప్ కార్న్ బిజినెస్ ప్రారంభించాలంటే ముందుగా మీరు ఎంపిక చేసుకున్న స్థలంని బట్టి బిజినెస్ ఉంటుంది. ఎక్కువగా పార్కులు, స్కూలు, షాపింగ్ మాల్స్ వంటి ప్రదేశాల్లో పాప్ కార్న్ బిజినెస్ చక్కగా అమ్ముడు పోతుంది. అయితే పాప్ కార్న్ సాధారణంగా కన్నా ఫ్లేవర్ ఉన్నటువంటి పాప్ కార్న్ తినేందుకు జనం ఎక్కువగా ఇష్టపడతారు. అందుకే దీనికి సంబంధించిన మసాలాలను కలిపి వేడివేడి పాప్ కార్న్ విక్రయించినట్లయితే జనం తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. మీరు కలిపిన మసాలాల ఘుమఘుమ ఆ చుట్టుపక్కల అంతా వ్యాపించేలా చేయాలి. అప్పుడు జనం పాప్ కార్న్ తినేందుకు ఎక్కువగా ఇష్టపడతారు. సాధారణంగా ఈ వ్యాపారం చేయడం ద్వారా కనీసం రోజుకు 2000 రూపాయల వరకు సంపాదించవచ్చు.
Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి. మీరు చేసే వ్యాపారాలు, పెట్టుబడులపై మీరు పొందే లాభనష్టాలకు పాఠకులకు డబ్బు, పెట్టుబడి, వ్యాపార సంబంధిత నిర్ణయాలు తీసుకునే ముందు వారి సర్టిఫైడ్ ఆర్థిక సలహాదారులను సంప్రదించమని సలహా ఇస్తుంది.
































