కేరళ పోలీసులు ఈ కొత్త స్కామ్ గురించి ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. వాట్సఅప్పులో తెలియని నంబర్ల నుండి వచ్చిన ఫోటోలు లేదా వీడియోలను డౌన్లోడ్ చేయడం లేదా తెరవడం చాలా ప్రమాదకరం. ఇలాంటి ఫైళ్లను తెరిస్తే, మీ ఫోన్లోని సున్నితమైన సమాచారం (పాస్వర్డ్లు, బ్యాంకింగ్ వివరాలు, OTPలు) హ్యాకర్ల చేతుల్లోకి వెళ్లిపోవచ్చు.
ఈ స్కామ్ ఎలా పనిచేస్తుంది?
ఈ మోసం వెనుక ఉన్న టెక్నాలజీని “స్టెగానోగ్రఫీ” అంటారు. ఇందులో, హానికరమైన కోడ్ను ఒక సాధారణ ఫోటోలో దాచివేస్తారు. ప్రత్యేకించి “LSB (Least Significant Bit) స్టెగానోగ్రఫీ” పద్ధతిలో, ఈ డేటాను ఫోటోలోని చిన్న పిక్సెల్స్ లో దాచుతారు. మీరు ఆ ఫోటోను తెరిస్తే, దానిలో దాచిన మాల్వేర్ సక్రియమవుతుంది. ఫలితంగా, మీ ఫోన్ నుండి అన్ని రహస్య డేటా హ్యాకర్లకు లీక్ అవుతుంది.
ఎలా జాగ్రత్త పడాలి?
-
తెలియని నంబర్ల నుండి వచ్చిన మీడియా ఫైళ్లను డౌన్లోడ్ లేదా ఓపెన్ చేయకండి.
-
“ఆటో డౌన్లోడ్” ఆప్షన్ ను వాట్సఅప్పు సెట్టింగ్స్ లో ఆఫ్ చేయండి.
-
సందేహాస్పద లింక్లు లేదా అటాచ్మెంట్లపై క్లిక్ చేయకండి.
ముఖ్యమైన విషయం:
ఇది ఇంతకు ముందు తెలిసిన సైబర్ మోసాల కంటే భిన్నమైనది. ఇక్కడ లింక్ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు, లాగిన్ డీటైల్స్ అడగరు. కేవలం ఫోటో తెరిస్తేనే మీ డివైస్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది!
కేరళ పోలీసులు ఫేస్బుక్ ద్వారా ఈ హెచ్చరికను పోస్ట్ చేసి, ప్రజలను ఈ స్కామ్ నుండి జాగ్రత్త వహించమని కోరారు.
































