Mobile Settings : ఫోన్ కొత్తగా ఉన్నప్పుడు.. చాలా స్మూత్‌గా, వేగంగా పని చేస్తుంది. ఈ సమయంలో ఫోన్ ఉపయోగించడం సరదాగా, ఆసక్తికరంగా ఉంటుంది. అయితే ఫోన్ పాతబడే కొద్దీ సాధారణంగా నెమ్మదించడం ప్రారంభమవుతుంది. అలాగే హ్యాంగ్ అవ్వడం కూడా జరుగుతుంది. దీంతో కొంత మంది విసిగిపోయి కొత్త ఫోన్స్(New Phones) కొనాలని ఆలోచిస్తారు. మరి కొందరు రిపేర్ షాప్ లో ఇస్తే బాగుపడుతుందని అనుకుంటారు. అయితే ఇప్పుడు ఇలాంటి చింత ఏమీ లేదు. ఎందుకంటే మీ ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చడం(Change Settings) ద్వారా.. మీ పాత ఫోన్‌ను కొత్తదిగా మార్చుకోవచ్చు. పాత ఫోన్ కొత్తదిగా ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము..
ఫోన్ లో క్రాష్ క్లియర్(Crash Clear) చేయడం అనేది ముఖ్యమైనది. ఫోన్ యాప్స్ లో క్రాష్ మెమరీని క్లియర్ చేయకపోవడం వల్ల ఫోన్ స్టోరేజ్, వేగంపై ప్రభావం చూపుతుంది. అయితే యాప్ క్రాష్ ఎలా క్లియర్ చేయవచ్చో మాకు ఇప్పుడు తెలుసుకోండి.
క్లియర్ క్యాచ్
ముందుగా, సెట్టింగ్‌లను ఓపెన్ చేయండి. ఆపై స్టోరేజ్‌పై క్లిక్ చేయండి . ఇప్పుడు స్టోరేజ్ ఎక్కువగా ఉన్న యాప్స్ డిస్ప్లే లో చూపబడతాయి. క్రాష్ ను క్లియర్ చేయాలనుకుంటున్న యాప్‌ను ఎంచుకోండి. ఇప్పుడు Clear Cache పై క్లిక్ చేయండి.
స్టోరేజ్ క్లియర్ చేయండి
మరింత స్టోరేజ్ ఖాళీ చేయాలనుకుంటే, ‘క్లియర్ స్టోరేజ్’ని ఎంచుకోండి. ఇది మొత్తం డేటాను తొలగిస్తుంది. వేగాన్ని పెంచడానికి వినియోగదారులు అనవసరమైన యాప్‌లు, అదనపు ఫోటోలను తీసివేయవచ్చు.
అప్‌డేట్‌లు కూడా ముఖ్యమైనవి,
యాప్ అప్డేట్స్(App Updates) ఫాలో అవ్వండి. అలాగే మొబైల్‌ను కూడా అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. ఎందుకంటే అప్‌డేట్‌లు తరచుగా బగ్ ప్యాచ్‌లను కలిగి ఉంటాయి. అప్డేట్ చేయడం ద్వారా ఇవి స్మార్ట్‌ఫోన్‌లోని ఏదైనా తప్పు ప్రోగ్రామ్‌ను సరిచేయడమే కాకుండా, కొత్త ఫీచర్లను కూడా అందిస్తాయి.