ప్రజల కోసం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన ప్లాన్ అమలు చేస్తుంది. ఈ ప్లాన్ పేరు ఎల్ఐసి సరల్ పెన్షన్ ప్లాన్.
ఈ ప్లాన్ లో మీరు చేరినట్లయితే పదవి విరమణ తర్వాత మీరు జీవితాంతం ప్రతి నెల పెన్షన్ అందుకోవచ్చు. ఎల్ఐసి లో ఈ ప్లాన్ భారత బీమా నియంత్రణ అలాగే అభివృద్ధి ప్రదాత నిబంధనలు, మార్గదర్శకాల ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంది. ఈ ప్లాన్ లో మీరు ఇప్పటి నుంచే చేరినట్లయితే మీరు వృద్ధాప్యంలో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం కొనసాగించవచ్చు. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ వాళ్లు అందిస్తున్న ఎల్ఐసి సరల్ పెన్షన్ యోజన ప్లాన్ అనేది సింగిల్ ప్రీమియం ప్లాన్.
ఇది ఎల్ఐసి వారు అందిస్తున్న నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇమీడియట్ పాలసీ. ఈ ప్లాన్ లో మీరు కేవలం ఒక్కసారి మాత్రమే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. కానీ పెన్షన్ మాత్రం క్రమం తప్పకుండా జీవితాంతం పొందవచ్చు. మార్కెట్ హెచ్చుతగ్గులలో ఉన్న సమయంలో కూడా సురక్షితమైన పెట్టుబడి కోరుకుంటున్న వాళ్లకి ఎల్ఐసి వాళ్లు అందిస్తున్న అద్భుతమైన పెన్షన్ ప్లాన్ ఇదే. ఎల్ఐసి అందిస్తున్న సరేలే పెన్షన్ యోజన ప్లాన్లో మీరు వార్షిక మొత్తంలో రూ.12 వేల రూపాయలు పొందవచ్చు. ఒకవేళ మీరు నెలవారి పెన్షన్ ఆప్షన్ ఎంపిక చేసుకున్నట్లయితే ప్రతినెలా కనీసం మీరు వెయ్యి రూపాయలు పెన్షన్ పొందవచ్చు. ఒకవేళ త్రైమాసికానికి ఆప్షన్ ఎంచుకున్నట్లయితే రూ.3000 రూపాయలు అలాగే అర్ధవార్షికానికి అయినట్లయితే రూ.6000 రూపాయలు పెన్షన్ పొందవచ్చు. తమ అవసరానికి అనుగుణంగా మీరు పెన్షన్ ఆప్షన్ ఎంచుకునే అవకాశం ఉంది.
ఎల్ఐసి లో మీరు ఈ ప్లాన్ కొనుగోలు చేసిన కేవలం ఒక నెలలోపు నుంచే మీకు పెన్షన్ ప్రారంభం అవుతుంది. ఎల్ఐసి అందిస్తున్న ఈ ప్లాన్ లో మీరు ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ ప్లాన్ లో చేరిన ఆరు నెలల తర్వాత మీరు ఎల్ఐసిలో రుణం కూడా తీసుకోవచ్చు. అత్యవసర సమయాలలో మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆదుకోవడానికి ఈ డబ్బు మీకు సహాయపడుతుంది. మీరు తీసుకునే రుణం కూడా మీరు రుణం పై చెల్లించే వార్షిక వడ్డీ లో 50 శాతానికి మించకుండా ఉండాలి. ఆదాయపు పన్ను చట్టంలో ఉన్న సెక్షన్ 80సి,10 డి కింద మీకు ఎల్ఐసి సరల్ పెన్షన్ యోజన ప్లాన్లో పన్ను మినహాయింపు కూడా ఉంటుంది.































