చిన్న గ్రామం నుంచి వచ్చిన ఓ యువకుడు తన కుటుంబం కోసం రెండు కోట్ల రూపాయలు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. కానీ ఆ యువకుడికి సరైన మార్గం తెలియకపోవడంతో చాలా కాలం పాటు తాను చేస్తున్న ఉద్యోగం నుంచి వచ్చిన డబ్బులను దుబారా చేసేవాడు.
ఆ క్రమంలోనే ఒక అనుభవజ్ఞుడైన ఆర్థిక సలహాదారుడిని కలిసాడు. “సిప్” Systematic Investment Plan (SIP) గురించి తెలుసుకున్నాడు. సిప్ అనేది పెట్టుబడి ప్రణాళిక అంటే ప్రతి నెలా నిర్దిష్ట మొత్తాన్ని పెట్టుబడిగా పెట్టడం. దీనిలో చిన్న మొత్తాల్లో పెట్టుబడి చేయడం ద్వారా క్రమంగా పెరుగుతుంది. దీర్ఘకాలంలో దీని నుంచి అధిక రాబడులు వచ్చే అవకాశం ఉంటుంది.
నెలకు రూ. 3500
ఆ క్రమంలో యువకుడు ఆలోచించి ప్రతి నెలా సిప్ విధానంలో పెట్టుబడులు చేయాలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం నెలకు రూ. 3500 పెట్టుబడి చేయాలని, ఆ విధంగా దాదాపు 27 ఏళ్లు ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నాడు. మొదటి నెలలో ఆ మొత్తాన్ని చెల్లించి, తన పెట్టుబడిని ప్రారంభించిన తర్వాత, యువకుడు ఏడాది తర్వాత తన పెట్టుబడి పెరుగుతుందా లేదా అని తెలుసుకున్నాడు. ఆ క్రమంలో యువకుడు చేసిన పెట్టుబడి క్రమంగా పెరగడం గమనించాడు. అది దీర్ఘకాలంలో ఇంకా పెరుగుతుందని భావించి నిరంతరం 27 ఏళ్లపాటు కొనసాగించాడు.
వడ్డీ రూపంలోనే..
అందుకోసం యువకుడు రూ. 11,34,000 లక్షలు పెట్టుబడి చేయగా, వచ్చిన మొత్తం మాత్రం రూ. 2,36,45,888 కోట్లు. వడ్డీ రూపంలోనే రూ. 2,25,11,888 కోట్లు లభించాయి. అయితే ఈ మొత్తం వార్షిక రాబడి 17 శాతం చొప్పున తీసుకుంటే లభించాయి. చివరకు ఆ యువకుడు 2 కోట్ల రూపాయలకుపైగా పొందినందుకు సంతోషం వ్యక్తం చేశాడు. సాధారణంగా సిప్ విధానంలో చేసిన పెట్టుబడులకు రాబడి 13 నుంచి 21 శాతం వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ యువకుని వాస్తవ జీవితం ఆధారంగా సిప్ పెట్టుబడులు తక్కువ సమయంలో చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులను పొందవచ్చు.
గమనిక: ఆంధ్రజ్యోతి సిప్ పెట్టుబడులు చేయాలని సూచించదు, సమాచారం మాత్రమే అందిస్తుంది. మార్కెట్ పరిస్థితులు, దేశ ఆర్ధిక పరిణామాలు, విదేశీ పెట్టుబడుల వంటి అంశాలపై సిప్ పెట్టుబడులను ప్రభావితం చేస్తాయి.