మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ”కనప్ప” (Kannappa).ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ‘రుద్ర’ అనే పాత్రలో నటించారు. అలాగే బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఈ సినిమాలో ”శివుడు” పాత్రలో నటించారు. కన్నప్ప సినిమాకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ”కన్నప్ప” మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుంది. కానీ మంచు విష్ణు మాత్రం సడన్ గా సైలెంట్ అయిపోయాడు. ఆ మధ్య సినిమా పోస్టర్లు, టీజర్ రీలీజ్ చేసి మంచి ప్రొమోషన్స్ చేసిన విష్ణు ఎందుకు ఇప్పుడు మౌనం పాటిస్తున్నాడు. మొదటి నుండి ఈ సినిమా విజువల్స్ విషయంలో అంతగా లేవు అనే టాక్ ఉంది. కాగా ఇటీవలే విడులైన టీజర్ పై కొన్ని ప్రశంసలు వచ్చిన మరోవైపు విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో నటించారు. అయితే శివుడి లుక్ పై చాలా మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ కూడా నటిస్తుండడంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రభాస్ లుక్ విషయంలో కూడా ఫ్యాన్స్ కొంత కలతగానే ఉన్నారు. అయితే మొన్నటి వరుకు అన్ని భాషల్లో ఈ సినిమా ప్రొమోషన్స్ చేస్తూ సందడి చేసిన విష్ణు ఈ సినిమా సెకండ్ టీజర్ రిలీజ్ తరువాత ఎక్కడ కనిపించడం లేదు. అడపాదడపా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెటడం మినహా ఎక్కడా విష్ణు అంతగా సందడి చేయలేదు. అందుకు కారణం ఈ సినిమా విజువల్స్ అనుకుంతా స్థాయిలో లేకపోవడంతో విష్ణు ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది. అయితే ప్రస్తుతం సినిమా క్వాలిటీ బాగా రావడానికి మంచు విష్ణు కష్టపడుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. ఈ సినిమాకి మంచు విష్ణు 100–200 కోట్లు ఖర్చు చేసారు అని తెలుస్తుంది. ఈ సినిమా 25 ఏప్రిల్ 2025న విడుదల కానుంది.
Also Read
Education
- All
- Students
- Teachers
- School Apps - Web Links
- IMP GOs
- CSE Proceedings
- Softwares
- Applications and Forms
- Special Programmes in Schools
- Usefull Videos
- AP MDM
- FA and SA Exams
- Dpt .Tests
- 10th Class / SSC
- Lesson Plans
- Service Rules
- PRC Related
- Time Tables
- Grants
- Leave Rules
- Income Tax
- APGLI / ZPPF / GSI
- CFMS
- NT Books
- Trainings
More
































