తెలంగాణ రాజకీయాల్లో కవిత (Kavitha) పేరు హాట్ టాపిక్‍గా మరారింది. బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన ఆమె తన ఫ్యూచర్ పొలిటికల్ కెరీర్‍పై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు.
దీంతో కవిత తీసుకోబోయే రాజకీయ నిర్ణయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. భవిష్యత్‍లో కవిత కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారని ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‍రెడ్డి రంగారెడ్డి (Mallu Reddy Rangareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత కాంగ్రెస్‍లో చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదన్నారు. మంగళవారం మీడియాతో చిట్‍చాట్ నిర్వహించిన మల్‌రెడ్డి రంగారెడ్డి ఈ సందర్భంగా సంచలన కామెంట్స్ చేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి మా పార్టీలోకి వస్తారని అనుకున్నామా వచ్చారు కదా? ఇప్పుడు కవిత కూడా కాంగ్రెస్‍లో (Congress Party) చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదని వ్యాఖ్యానించారు. త్వరలో కవిత సొంత పార్టీ ప్రారంభించబోతున్నారనే ప్రచారం వేళ మల్‍రెడ్డి రంగారెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయాంగా ఆసక్తిని రేపుతున్నాయి.
నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం:
మంత్రి పదవి ఆశిస్తున్న మల్‍రెడ్డి రంగారెడ్డి ఈ అంశంపై కూడా స్పందించారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే పార్టీకే నష్టం అన్నారు. నిరాకరిస్తే నాకేం నష్టం లేదు. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఆలోచించాలన్నారు. రెండు కోట్ల మంది ప్రజలు ఉన్న జిల్లాకు ఇంత వరకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమేనని రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చు. కానీ జిల్లా స్వరూపం మారొద్దున్నారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో రియల్ భూమ్ పెరిగింది… భూముల రేట్లు పెరుగుతున్నాయని భూములు ఎవరూ అమ్మడం లేదు. ఫార్మాసిటిపై పోరాటం చేసినందుకే గతంలో నన్ను కేసీఆర్ ఓడగొట్టారని కానీ ఫార్మాసిటి వచ్చి ఉంటే 50 కిలోమీటర్ల మేర కాలుష్యం అయ్యేదన్నారు.

































