సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేసీఆర్: ఎందుకంటే?

www.mannamweb.com


మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్‌ నరసింహారెడ్డి కమిషన్‌ ఇచ్చిన సమన్లపై కేసీఆర్‌ సుప్రీంకోర్టుకు వెళ్లారు.

ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. కమిషన్‌ సమన్లపై హైకోర్టు జులై 1న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టుకు కేసీఆర్‌ వెళ్లారు. కేసీఆర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై రేపు(సోమవారం) సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది.

కాగా, కేసీఆర్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారం, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం తదితర అంశాలపై విద్యుత్ కమిషన్ ఏర్పాటు చేశారు. తెలంగాణలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై జస్టిస్ ఎల్. నరసింహారెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ నియమించిన విషయం తెలిసిందే.

అయితే ఈ కమిషన్‌ మాజీ సీఎం కేసీఆర్‌కు రెండోసార్లు నోటీసులు పంపించింది. విద్యుత్‌ కొనుగోలు ఒప్పందంలో మాజీ సీఎం కేసీఆర్‌ పాత్రపై కమిషన్‌ వివరణ కోరింది.

ఈ క్రమంలో తనను విచారణకు పిలవకూడదంటూ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(KCR) తెలంగాణ హైకోర్టును ఇటీవల ఆశ్రయించారు. అయితే కేసీఆర్‌కు ఉన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. కేసీఆర్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. దీనిపై సోమవారం సుప్రీంకోర్టు విచారించనుంది.