గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పదేళ్ల పాటు పరిపాలన కొనసాగించిన బీఆర్ఎస్ ని కాదని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రమాదానికి గురై చాలా రోజులు ఫామ్ హౌజ్ లోనే ఉండిపోయారు. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిపక్షనేతగా అసెంబ్లీకి రానున్నారని బుధవారం బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. నేడు గురువారం (జులై 25) తెలంగాణ అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అడుగు పెట్టారు. ఎన్నికల తర్వాత తొలిసారిగా ఆయన అసెంబ్లీలోకి అడుగు పెట్టారు. ఈ క్రమంలోనే నేతల మధ్య వాదోపవాదాలు ఎలా ఉంటాయో అన్న దానిపై ఆసక్తి నెలకొంది. వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన ప్రమాదానికి గురయ్యారు. హాస్పిటల్ లో శస్త్ర చికిత్స తర్వాత కొన్ని నెలల పాటు తన ఫామ్ హౌజ్ లో రెస్ట్ తీసుకున్నారు. ఆ మధ్య ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే ఒక్కసారి అసెంబ్లీకి వచ్చారు. పార్లమెంట్ లో వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టిన తర్వాత తెలంగాణలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశ పెట్టబోతుంది. ఈ క్రమంలోనే ఆయన తొలిసారిగా ప్రతిపక్ష నేత హూదాలో పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు.
2024-25 వార్షిక బడ్జెట్ ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంట్ లో ప్రవేశ పెట్టారు. ఈ క్రమంలనే తెలంగాణ ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు. మొదటి సారిగా అసెంబ్లీలోకి ప్రతిపక్ష నాయకుడిగా అడుగు పెట్టిన కేసీఆర్ తన వాగ్ధాటిని ఎలా వినిపించనున్నారు.. సీఎం రేవంత్ రెడ్డితో ఎలా ఢీ కొట్టబోతున్నారన్న అంశాలపై కొద్ది రోజులుగా చర్చజరుగుతుంది. ఈ క్రమంలోనే కేసీఆర్ అసెంబ్లీకి అడుగు పెట్టడం చర్చనీయాంశంగా మారంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ కి కేటాయించిన చాంబర్ లో ఎలాంటి మార్పులు ఉండబోవని అసెంబ్లీ వర్గాలు ప్రకటించాయి.