Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సంచలన విషయాలను బయటపెట్టింది. ఈకేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో సంబంధాలు ఉన్నట్లుగా తెలియజేసింది.
లిక్కర్ స్కాంలో మరో పెద్ద తలకాయ..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ సంచలన విషయాలను బయటపెట్టింది. ఈకేసులో తీగ లాగితే డొంక కదులుతోంది. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ కు ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుతో సంబంధాలు ఉన్నట్లుగా తెలియజేసింది. ఇప్పటికే ఈ కేసులో ఢిల్లీ సర్కారుకు సంబంధించి సీఎం కేజ్రీవాల్, డిప్యుటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జైలుకు పంపింది ఈడీ. తాజాగా ఈ కేసుకు సంబంధించి కొత్త విషయాలను ఢిల్లీ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది ఇన్ఫోర్స్ మెంట్ డైరెక్టరెట్. ఢిల్లీ లిక్కర్ పాలసీ, రిటైల్ వ్యాపారం గురించి కవిత ముందుగానే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లుగా వెల్లడించింది. అసలు ఈ కేసులో కేసీఆర్ పాత్ర కూడా కీలకమే అనే విషయాన్ని కోర్టుకు తెలియజేసింది.
కేసీఆర్ పాత్ర ఎంత ఉంది..
ఢిల్లీ లిక్కర్ పాలసీ, రిటైల్ వ్యాపారం గురించి కవిత కేసీఆర్ కు ముందుగానే చెప్పినట్లు.. అలాగే కవిత టీంలోని సభ్యులుగా ఉన్న వారిని ఢిల్లీ కేసీఆర్ నివాసంలో పరిచయం చేసినట్లుగా ఈడీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. వీటితో పాటు మరికొన్ని వీస్తుపోయే నిజాల్ని వెల్లడించింది.బుచ్చిబాబు, అరుణ్ పిళ్లై, అభిషేక్ బోయినపల్లిని పరిచయం చేయగా వారి నుంచే మద్యం వ్యాపారం వివరాలు కేసీఆర్ అడిగి తెలుసుకున్నారని ఈడీ కోర్టుకు తెలిపింది. ఇక ఈకేసులో కింగ్ పిన్ గా ఉన్న కవితకు ఇప్పుడు బెయిల్ ఇస్తే ఈకేసుపై తీవ్రప్రభావం పడే అవకాశం ఉందని వాదనలు వినిపించింది. అయితే ఢిల్లీ హైకోర్టు ఈ కేసులో తీర్పును మే 30కి వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కాంపై లోక్ సభ ఎన్నికల ప్రచారం సమయంలో కేసీఆర్ స్పందించారు. తన కూతురు కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని గులాబీ బాస్ చెప్పారు. అయితే ఇప్పుడు ఈడీ, సీబీఐ ఈకేసులో కేసీఆర్ పేరును కూడా తెరపైకి తేవడం చూస్తుంటే ఆయన చుట్టూ కూడా ఉచ్చు బిగిస్తోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.