ఇంట్లో క్యాష్ ఉంచుతున్నారా! ఇన్‌కమ్ ట్యాక్స్ రూల్స్ తెలుసుకోకపోతే బుక్కవుతారు

న్ కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారం ప్రతీ రూపాయికి లెక్క ఉండాలి. ఇది ఎక్కడి నుంచి వచ్చింది. ఎప్పుడు వచ్చింది అని. ఒకవేళ డబ్బు బ్యాంకుల్లో ఉంటే వాటి వివరాలు ఎలాగూ బ్యాంకుల్లో రిజిస్టర్ అయ్యి ఉంటాయి.


మరి లిక్విష్ క్యాష్ రూపంలో ఇంట్లో ఉండే డబ్బు సంగతి ఏంటి?

ప్రస్తుతం రోజువారీ పనులన్నీ ఆన్ లైన్, యూపీఐ ద్వారా జరుగుతున్నప్పటికీ ఎంతో కొంత క్యాష్ కూడా అవసరం అవుతుంది. అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బంది పడకుండా చాలామంది కొంత మొత్తాన్ని ఇంట్లో దాచుకుంటుంటారు. అయితే చట్టబద్ధంగా ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవచ్చు అనేది చాలామందికి తెలియదు. ఆదాయపు పన్ను శాఖ ప్రకారం ఇంట్లో క్యాష్ ఉంచుకోవడానికి ఎలాంటి లిమిట్ లేదు. నిజమే.. మీరు కోట్ల రూపాయలు మీ దగ్గర క్యాష్ రూపంలో ఉంచుకోవచ్చు. అయితే ఈ డబ్బు చట్టబద్ధమైనది అని మీరు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన ఆధారాలు మీ దగ్గర ఉండాలి.

ఆధారాలు అంటే..

డబ్బుకి ఆధారాలు అంటే.. అది ఎలా వచ్చిందో సోర్స్ ద్వారా చూపించగలగాలి. వ్యాపారం లేదా ఆస్తి/నగలు వంటివి అమ్మడం లేదా బ్యాంకు నుంచి విత్ డ్రా చేసుకున్నారా అని చూపించాలి. దీనికి సంబంధించిన విత్ డ్రాల్ ప్రూఫ్స్, ఆస్తులు అమ్మితే ఆ పత్రాలు, ఐటీఆర్ పేపర్స్.. ఇలా ఆయా రసీదులు మీరు జాగ్రత్తగా దాచుకోవాలి. ఇలా డబ్బు మొత్తానికి సరిపడా ప్రూఫ్స్ మీరు చూపిస్తే.. మీకు ఎలాంటి సమస్యా ఉండదు. ఒకవేళ మీరు సోర్స్ చూపించలేకపోతే, అది అక్రమ సంపాదనగా పరిగణిస్తారు. అంటే బ్లాక్ మనీ అన్నమాట. అటువంటి సందర్భాలలో జరిమానా లేదా ఇతర శిక్షలు విధించొచ్చు.

కొన్ని రూల్స్ ఉన్నాయ్

ఇన్ కమ్ ట్యాక్స్ ప్రకారం మీ దగ్గర సోర్స్ లు ఉన్నప్పటికీ.. కొన్ని ట్రాన్సాక్షన్స్ ను చట్ట విరుద్ధంగా పరిగణిస్తారు. అవేంటంటే..

  • మీరు రూ.2 లక్షలకు మించి డబ్బుని బహుమతి రూపంలో స్వీకరించకూడదు.
  • పాన్ కార్డు లేకుండా బ్యాంకులో రూ.50 వేల కంటే ఎక్కువ క్యాష్ డిపాజిట్ చేయకూడదు. అలాగే ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షలకు మించి డిపాజిట్ చేయకూడదు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.