తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ్టి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోనున్నాయి. బకాయిల చెల్లింపులో ప్రభుత్వం జాప్యాన్ని నిరససిస్తూ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపి వేస్తున్నట్టు నెట్ వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది.
తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద అనుసందానమైన 23 ప్రైవేట్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి 14 వందల కోట్లకు పైగా బకాయిలు రావాల్సి ఉంది. అటు ఏపీలోనూ ప్రభుత్వం 25 వందల కోట్లు బకాయిలు పడినట్టు ఏపీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది.
ఆసుపత్రులపై భారీ ఆర్ధిక భారం, నిర్వహాణ కష్టాలు పెరుగుతున్నాయని చెప్పారు. డాక్టర్ల సిబ్బందికి వేతనాల చెల్లింపులో ఇబ్బందులు ఏర్పడుతున్నాయని చెప్పారు. బకాయిలు చెల్లించకపోతే మరిన్ని వైద్య సేవలు నిలిచిపోతాయని చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని ప్రైవేట్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. తప్పని సరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామంటున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరిస్తున్నారు.
































