YSRCP: వైకాపాకు భారీ షాక్ ఇవ్వబోతున్న కీలక నేతలు?
వైకాపాకు భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. పలువురు ఎంపీలు, కీలక నేతలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం.
అమరావతి: వైకాపాకు భారీ షాక్ తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యనేతలు, పలువురు ఎంపీలు ఆ పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నారు. రాజ్యసభ సభ్యత్వానికి మోపిదేవి వెంకటరమణ, బీదా మస్తాన్‌రావు గురువారం రాజీనామా చేయనున్నట్టు సమాచారం. దిల్లీ బయల్దేరిన ఇద్దరు నేతలు రాజ్యసభ ఛైర్మన్‌ను కలిసి రాజీనామా లేఖలు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అనంతరం వైకాపా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయనున్నట్టు సమాచారం. ఇద్దరూ త్వరలోనే తెలుగుదేశంలో చేరే అవకాశముంది. మోపిదేవి, బీదా మస్తాన్‌రావు బాటలోనే మరికొందరు ఎంపీలు ఉన్నట్టు సమాచారం. వైకాపాలో ఎదురైన అవమానాలు, జగన్ ప్రజా వ్యతిరేక విధానాలతో విసిగిపోయి ఆ పార్టీని వీడుతున్నామని నేతలు అంటున్నారు. పలువురు ఎంపీలు భాజపాలో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.