ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ హయాంలో ఏర్పాటైన వార్డు, గ్రామ సచివా లయాల బాధ్యతల ఖరారు విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది.
వాలంటీర్ల సేవలు ప్రస్తుతానికి అందుబాటులో లేవు. భవిష్యత్ లో అవకాశం ఇస్తారా లేదా అనేది ఇంకా స్పష్టత లేదు. ఇదే సమయంలో వార్డు – గ్రామ సచివాలయాల ఉద్యోగులతోనే పెన్షన్లు పంపిణీ చేయిస్తున్న ప్రభుత్వం.. తాజాగా మరో కీలక బాధ్యతలను అప్పగించింది.
ప్రభుత్వం తాజా నిర్ణయం
ఏపీ ప్రభుత్వం స్వర్ణాంధ్ర విజన్ -2047 అమలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు కొనసాగుతోంది. అందులో భాగంగా విజన్ అమలు కోసం ప్రభుత్వం తాజాగా జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో కమిటీలను ఏర్పాటు చేసింది. ఇందులో సచివాయాల కార్యదర్శల కు బాధ్యతలు కేటాయించింది. జిల్లా స్థాయిలో అమలు బాధ్యతలను జిల్లా ఇంఛార్జ్ మంత్రి పర్యవే క్షిస్తారు. జిల్లా కమిటీలో సభ్యులుగా లోక్‌సభ, రాజ్యసభ ఎంపిలు, ఎమ్మెల్యే, ఎంపిలు, జెడ్పీ చైర్మన్, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు ఉంటారు. నియోజకవర్గాల యూనిట్‌కు స్థానిక ఎమ్మెల్యే చైర్మన్‌గా, నియోజకవర్గ ప్రధాన కేంద్రంలోని ఎంపిడివో కన్వీనర్‌గా ఎమ్మెల్సీ, మున్సిపల్ చైర్‌పర్సన్, ఆర్డీవో, ఇతర మున్సిపల్ కమిషనర్లు సభ్యులుగా ప్రభుత్వం పేర్కొంది.
విధుల కేటాయింపు
ఇదే సమయంలో సచివాలయాల కమిటీల్లో సర్పంచులు.. కార్పొరేటర్, వార్డు కౌన్సిలర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రభుత్వం ఈ విజన్ -2047 అమలు బాధ్యతలను గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జారీ చేసిన ఉత్తర్వుల్లో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న వారిలో కొంత మందిని ఈ విధానం అమలుకోసం ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి ఐదుగురు చొప్పున 875 మందిని ఎంపిక చేయనున్నారు. స్టాటాస్టిక్స్, గణాంక, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్, ఎంబిఏ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, రాజకీయ శాస్త్రం, వ్యవసాయం, ఇంజనీరింగ్ అంశాల్లో డిగ్రీ అర్హత కలిగిన వారు నియోజకవర్గాల్లో పనిచేసేందుకు అర్హులుగా నిర్ణయించారు.
ప్రత్యేక బాధ్యతలు
అలాగే జిల్లాకు ఐదుగురు చొప్పున 130 మందిని జిల్లా స్థాయి విజన్ అమలుకు వినియోగించుకో వాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ ప్రభుత్వ శాఖల్లో శాఖకు ఇద్దరు చొప్పున 70 మందిని, ప్రణాళిక శాఖల్లో మరో 25 మంది కార్యదర్శులను ఎంపిక చేసి వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధుల కోసం ఎంపిక చేసిన కార్యదర్శులు ఆన్ డ్యూటీ కింద తమకు అప్పగించిన ప్రాంతాల్లో, శాఖల్లో పనిచేయాల్సి ఉంటుంది. ముందుగా ఏడాదిపాటు వారిని ఓడి విధానంలో కొనసాగిస్తారు. అలాగే నాలుగు విభాగాల్లో పనిచేస్తున్న కార్యదర్శులనే విజన్‌కు వినియో గించుకోనున్నారు. మహిళ పోలీస్, సర్వే అసిస్టెంట్, రెవెన్యూ కార్యదర్శి, ప్లానింగ్ రెగ్యులేషన్ కార్యదర్శులను విజన్‌కు వినియోగించనున్నారు. ఈ సిబ్బంది ఎంపిక బాధ్యత కలెక్టర్ కు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.