EPS 95 పెన్షన్ దారులకు కీలక అప్ డేట్ త్వరలోనే మినిమం పెన్షన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసే ఛాన్స్

సుదీర్ఘకాలంగా ఈపీఎస్ 95 పెన్షనర్లు తమ మినిమం పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి 7,500 రూపాయలకు పెంచాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారికంగా స్పందన లేకపోవడం గమనార్హం. నిజానికి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి పార్లమెంటరీ కమిటీ కూడా పెన్షనర్ల డిమాండ్లను సహేతకుకమైనవే అని తెలిపింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మినిమం పెన్షన్ పెంపుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.


కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఇప్పటికే 8వ పే కమిషన్ విషయంలో ఆలస్యం చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఎనిమిదో పే కమిషన్ ఏర్పాటు ఇంకా జరగలేదు. . అయితే ఇదే నేపథ్యంలో అటు ఈపీఎస్ 95 పెన్షనర్లకు కూడా ఊరట లభించలేదన్న సంగతి తెలిసిందే సుదీర్ఘకాలంగా ఈపీఎస్ 95 పెన్షనర్లు తమ మినిమం పెన్షన్ వెయ్యి రూపాయల నుంచి 7,500 రూపాయలకు పెంచాలని సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారికంగా స్పందన లేకపోవడం గమనార్హం. నిజానికి కేంద్ర ప్రభుత్వం నియమించినటువంటి పార్లమెంటరీ కమిటీ కూడా పెన్షనర్ల డిమాండ్లను సహేతకుకమైనవే అని తెలిపింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికీ మినిమం పెన్షన్ పెంపుదల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. గతంలో మినిమం పెన్షన్ 3000 రూపాయలకు పెంచుతామని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ అది కూడా కార్యరూపంలోకి దాల్చలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం 7500 పెన్షన్ పెంచాలని ఈపీఎస్ 95 పెన్షనర్లు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు.
దీనికి తోడు ఈపీఎఫ్ 95 కు సంబంధించినంతవరకు అటు హయ్యర్ పెన్షన్ విషయంలో కూడా పెన్షనర్లు అసహనంతో ఉన్నారు. . ముఖ్యంగా పెన్షనర్లు హయ్యర్ పెన్షన్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ కూడా, అర్హులైన పెన్షనర్లకు పెన్షన్ పే ఆర్డర్లను అందించడానికి ఇంకా కసరత్తు పూర్తిస్థాయిలో ఊపు అందుకోలేదు. ఇక ఈపీఎస్ 95 పెన్షన్ కు సంబంధించి వాళ్ళు కీలకమైన విషయాలు కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది అందులో ఈ పథకం కింద దాదాపు 81 లక్షల మందికి పెన్షన్ లభిస్తుందని పేర్కొంది. అయితే ఈ మొత్తంలో కేవలం 53,541 మందికి మాత్రమే 6000 రూపాయల కన్నా ఎక్కువ పెన్షన్ లభిస్తుందని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభ పేర్కొన్నారు. నిజానికి ఈపీఎస్ 95 పెన్షన్ కింద కనీస పెన్షన్ 7500 చేయాలని ట్రేడ్ యూనియన్లు ఎప్పటినుంచో సుదీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇదే గణాంకాల్లో ఈ ఏడాది మార్చి 31వ తేదీ నాటికి దాదాపు 49 లక్షల మందికి నెలకు 1500 కంటే తక్కువ పెన్షన్ లభిస్తుందని ఆమె గణాంకాల్లో పేర్కొన్నారు.
మరోవైపు ఈపీఎస్ 95 మినిమం పెన్షన్ విషయంలో పెన్షనర్లు పెద్ద ఎత్తున మినిమమ్ పెన్షన్ పెంచాల్సిందే అని పట్టుబడుతున్నారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం త్వరలోనే సానుకూలమైన నిర్ణయం తీసుకోవాలని పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తోందని అధికారిక వర్గాలు చెబుతున్నారు.
👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.