రూ.1.29 కోట్ల ధరతో సంస్థకు చెందిన దేశంలోనే అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ వెహికిల్‌ని కియా మోటార్స్ లాంచ్ చేసింది. ఈ లగ్జరీ ఎస్‌యూవీని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 561 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ వెహికిల్ ఫొటోలు, వివరాలను ఇక్కడ చూసేయండి..
కియా తన ఫ్లాగ్షిప్ ఈవీ9 ఆల్-ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని భారతదేశంలో రూ .1.29 కోట్ల భారీ ధరతో విడుదల చేసింది. ఈ ఎస్‌యూవీని భారత మార్కెట్లలో మాత్రమే, జిటి-లైన్ ట్రిమ్‌లో విడుదల చేశారు.
కియా ఈవీ9 వీల్ బేస్ 3100 ఎంఎం కాగా గ్రౌండ్ క్లియరెన్స్ 198 ఎంఎంగా ఉంది. కారు మొత్తం ఎత్తు 1980 ఎంఎం
ఈ హెడ్‌ల్యాంప్స్‌లో స్టార్ మ్యాప్ డేటైమ్ రన్నింగ్ లైట్స్ (ఎస్డీఆర్ఎల్), డైనమిక్ వెల్కమ్ ఫంక్షన్‌తో కూడిన ఇంటెలిజెంట్ ఐస్ క్యూబ్ ఎల్ఈడీ ప్రొజెక్షన్ హెడ్‌ల్యాంప్స్ (ఐఎల్ఈడీ) ఉన్నాయి. ముందు భాగంలో 52 లీటర్ల స్టోరేజ్ స్పేస్ కూడా ఉంది.
టెయిల్ల్యాంప్స్లో స్టార్ మ్యాప్ ఎల్ఈడీ కాంబినేషన్ ల్యాంప్ కూడా ఉంది.
కియా ఈవీ9లో 4-స్పోక్ స్టీరింగ్, ఇన్ఫోటైన్మెంట్, డ్రైవర్ సమాచారం కోసం డ్యూయల్ 12.3 ఇంచ్ డిస్ప్లేలు ఉన్నాయి. 64-డ్యూయెల్ కలర్ యాంబియంట్ లైటింగ్, కప్ హోల్డర్ విత్ స్లైడింగ్ కవర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
మూడొవ వరుసలో రెండు సీట్లు ఉన్నాయి, ఇవి విడివిడిగా హెడ్-రెస్ట్‌లను కలిగి ఉంటాయి, వీటని ఫోల్డ్ చేయవచ్చు. 3 పాయింట్ సీట్ బెల్ట్‌లను కలిగి ఉంటాయి. 50:50 స్ప్లిట్ ఫోల్డింగ్ సామర్థ్యం ఉన్న సీట్లలో ఐఎస్ఓ-ఫిక్స్ మౌంట్లు కూడా అందుబాటులో ఉన్నాయి. మొత్తం 6 యూఎస్బీ-సీ పోర్టులు (ఒక్కో వరుసలో రెండు) ఉన్నాయి.
రెండవ వరుసలో 8-వే ఎలక్ట్రానిక్ అడ్జెస్టెబుల్, రిలాక్సేషన్ ఫంక్షన్, మసాజ్ ఫంక్షన్, వెడల్పాటి వింగ్-అవుట్ హెడ్ రెస్ట్‌తో కెప్టెన్ సీట్లు ఉన్నాయి. ఈ సీట్లలో మూడొవ వరుస సీట్లను యాక్సెస్ చేయడానికి వన్-టచ్ ఫోల్డ్ ఫంక్షనాలిటీ లభిస్తుంది.
కియా ఈవీ9 బూట్ లో మెటల్ ప్లేట్లతో 333 లీటర్ల స్పేస్ లభిస్తుంది.
వెహికల్ టు లోడ్ (వీ2ఎల్) టెక్నాలజీ, ఏడీఏఎస్ లెవల్-2 సూట్, హెచ్‌వీఏసీ కంట్రోల్స్ కోసం 6 ఇంచ్ డిస్ప్లే, ఓవర్-ది-ఎయిర్ సాఫ్ట్వేర్ అప్డేట్స్, అడిజిటల్ ఐఆర్వీఎం వంటి సౌకర్యాలు కూడా ఈ కియా ఈవీ9లో ఉన్నాయి.