ఇండియన్ రైల్వేస్‌లో రాజధాని ఎక్స్‌ప్రెస్ అత్యున్నత సౌకర్యాలు, వేగవంతమైన ప్రయాణం, న్యూఢిల్లీని ప్రధాన నగరాలతో కలిపే ప్రత్యేక రైలు. 1969లో ప్రారంభమైంది.
ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే వ్యవస్థ మనది. శతాబ్దాల చరిత్ర కలిగిన మన ఇండియన్ రైల్వేస్ (Indian Railways) కాలానుగుణంగా అభివృద్ధి చెందుతూ వస్తోంది. ప్యాసింజర్లకు కంఫర్ట్, ఫాస్టెస్ట్, రాయల్ జర్నీని అందించడానికి లగ్జరీ, వేగవంతమైన ట్రైన్ సర్వీసులను తీసుకొస్తోంది. మరోవైపు, తక్కువ ధరలకే రైలు ప్రయాణాన్ని అందిస్తూ వైవిధ్యాన్ని చాటుతోంది. దేశంలో ఇప్పటికే పలు సర్వీసులు రాయల్ వసతులను కల్పించడానికి, మరికొన్ని వేగవంతమైన ప్రయాణాన్ని అందించడానికి, ఇంకొన్ని టైంకి ప్యాసింజర్లను గమ్యస్థానాలకు చేర్చేందుకు నడుస్తున్నాయి. అయితే, మన ఇండియన్ రైల్వేస్‌లో రారాజుగా పిలిచే ఓ ట్రైన్‌లో మాత్రం టైమింగ్స్, కంఫర్ట్ జర్నీ, నాణ్యమైన సేవలకు పాపులర్ అయింది. ఆ ట్రైన్ ఏదో తెలుసుకుందాం.
ఇండియన్ రైల్వేస్‌లో రారాజుగా (King of Indian Railways) రాజధాని ఎక్స్‌ప్రెస్‌ని (Rajadhani Express) పిలుస్తుంటారు. పేరుకు తగ్గట్టుగానే ఇది దేశ రాజధాని న్యూఢిల్లీని, దేశవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన నగరాలతో కలుపుతుంది. అందులోనూ, వివిధ రాష్ట్రాల క్యాపిటల్ సిటీలను కనెక్ట్ చేయడం దీని ప్రత్యేకత. అత్యున్నత సౌకర్యాలు, ఫాస్టెస్ట్ షెడ్యూల్స్, శుభ్రమైన ఇంటీరియర్స్, రుచికరమైన భోజనం, కంఫర్ట్ వంటివి ప్యాసింజర్లకు రాయల్టీ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తాయి. పైగా, ఇండియాలో తొలి ఎయిర్ కండిషన్డ్ ఎక్స్‌ప్రెస్ రైలు ఇదే కావడం, ఈ రైలు నడిచే మార్గంలో ఇతర ట్రైన్లు ఓవర్‌టేక్ చేసేందుక అనుమతి ఉండకపోవడం వంటివి ఇండియాకు గర్వకరాణంగా నిలుస్తోంది.
ఎప్పుడు స్టార్ట్ అయింది?తొలి రాజధాని ఎక్స్‌ప్రెస్ 1969, మార్చి 3న న్యూఢిల్లీ నుంచి హౌరా (కోల్‌కతా) మధ్య ప్రారంభం అయింది. ఈ రైలు రాకతో రెండు ప్రధాన నగరాల మధ్య ప్రయాణ సమయం 17 గంటలకు తగ్గింది. ఇండియన్ రైల్వేస్ సాధించిన గొప్ప విజయం ఇది. ఆ తర్వాత క్రమంగా రాజధాని ఎక్స్‌ప్రెస్ సర్వీసులు మరిన్ని రూట్లలో విస్తరించాయి. ముంబై, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, గౌహతి వంటి ఇతర మెట్రో నగరాలకు కనెక్ట్ అయింది. భారతీయ రైల్వే క్రమంగా మోడర్నైజ్ అవుతోందని చెప్పడానికి ఈ సర్వీసులే పర్‌ఫెక్ట్ ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. మరి, ఇండియాలో టాప్ 5 రాజధాని రూట్స్ ఏంటో చూద్దాం.
హౌరా- న్యూఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్1969లో స్టార్ట్ అయిన ఈ ఎక్స్‌ప్రెస్.. అతి పురాతనమైన రాజధాని ఎక్స్‌ప్రెస్‌గా నిలుస్తోంది. చాలా మంది ప్యాసింజర్లు ఇప్పటికీ దీనిని అన్ని రాజధాని రైళ్లలో అత్యంత ప్రసిద్ధిగా భావిస్తారు.
ముంబై సెంట్రల్- న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్భారత ఆర్థిక రాజధాని ముంబైని దేశ రాజధానికి కలిపే సర్వీస్ ఇది. మన దేశంలో అత్యంత వేగవంతమైన రైళ్లలో ఇదొకటి. గంటకు 130 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ట్రావెల్ చేస్తుంది. రాయల్ ఇంటీరియర్స్, విలాసవంతమైన భోజనం, ట్రైన్డ్ స్టాఫ్‌తో కూడిన ఈ ఎక్స్‌ప్రెస్ రెండు నగరాల మధ్య ట్రావెల్ చేసే టూరిస్టులకు, వ్యాపారులకు ఫస్ట్ ఛాయిస్‌గా నిలుస్తోంది.
బెంగళూరు– న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్2,300 కిలోమీటర్లకు పైగా విస్తరించి ఉన్న ఈ రాజధాని ఎక్స్‌ప్రెస్.. బెంగళూరును న్యూఢిల్లీతో కలుపుతుంది. దూరం ఎక్కువే అయినప్పటికీ ప్యాసింజర్లకు కంఫర్ట్ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ కాదు. పైగా, సౌత్ ఇండియా అందాలు, నార్త్, సౌత్ వంటకాలతో కూడిన సమర్థవంతమైన క్యాటరింగ్ సేవకు ఇది పాపులర్ అయింది.
చెన్నై– న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్దక్షిణ భారత సాంస్కృతిక కేంద్రమైన చెన్నైని దేశ రాజధానికి ఇది కలుపుతుంది. టేస్టీ లోకల్ ఫుడ్, బెస్ట్ స్లీపర్ ట్రైన్‌గా ఇది పాపులర్ అయింది. వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల గుండా ఇది వెళ్తూ ఆయా రాష్ట్ర ప్యాసింజర్లకు సౌకర్యాన్ని అందిస్తుంది.
గౌహతి– న్యూ ఢిల్లీ రాజధాని ఎక్స్‌ప్రెస్ఈ రాజధాని ఈశాన్య రాష్ట్రాలను న్యూఢిల్లీకి కలుపుతుంది. అందమైన పచ్చని లోయలు, నదులు, కొండ ప్రాంతాల గుండా వెళుతుండటంతో పాటు అస్సాం, బీహార్ మీదుగా వెళ్తూ బెస్ట్ ట్రావెలింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తున్నాయి.

































