పసుపు దంతాలను తెల్లగా మార్చేందుకు ఇంటి చిట్కాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. అలాంటి సహజ పరిష్కారాలలో ఒకటి బేకింగ్ సోడా. దీనిని సోడియం బైకార్బోనేట్ అని కూడా పిలుస్తారు.
బేకింగ్ సోడాను పటిక పొడిని సమాన నిష్పత్తిలో కలపి బ్రష్ చేయండి. వారానికి రెండు సార్లు ఇలా చేయండి. మీరు బేకింగ్ సోడాతో టూత్‌పేస్ట్‌ను కూడా ఉపయోగించవచ్చు.
వేప పుల్లతో కూడా పసుపు దంతాలకు స్వస్తి చెప్పొచ్చు. వేపలో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. మనలో చాలా మంది ఇప్పటికీ వేప పుల్లను బ్రష్ గా వాడుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ బాక్టీరియల్ గుణాలు పసుపు రంగును తొలగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాకుండా మీ దంతాలను తెల్లగా చేయడంతోపాటు చిగుళ్లను బలోపేతం చేస్తుంది.
సిట్రస్ పండ్ల తొక్కలు పసుపు దంతాలకు చక్కటి పరిష్కారంగా పనిచేస్తాయి. పండ్లు మీ దంత ఆరోగ్యానికి అద్భుతంగా పనిచేస్తాయి. అరటిపండు, నిమ్మకాయ లేదా నారింజ తొక్క మరియు స్ట్రాబెర్రీ పేస్ట్‌ని మీ దంతాలకు అప్లై చేయడం వల్ల తెల్లగా మెరవడంతోపాటు బలంగా తయారువుతాయి.
నోటిని పరిశుభ్రంగా ఉంచడంలో కొబ్బరి నూనె బాగా పనిచేస్తుంది. ఇది మీ దంతాలను తెల్లగా చేయడంలోనూ, మెరిసేలా చేయడంలోనూ ఇది సూపర్ పనిచేస్తుంది. ఇందులో ఉండే లారిక్ యాసిడ్ మంటను తగ్గించి బ్యాక్టీరియాను చంపుతుంది.
ఎండిన తులసి ఆకులను ఆవాల నూనెతో మిక్స్ చేసి ఆ మిశ్రమాన్ని దంతాలపై రాయండి. దీంతో మీ పళ్లు తెలతెల మెరుస్తాయి. తులసి మౌత్ వాష్ యాంటీప్లాక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఈ రెమెడీని పాటిస్తే కేవలం కొద్ది రోజుల్లోనే దంతాలు ముత్యాల మాదిరి తెల్లగా, ఆకర్షణీయంగా మారతాయి. పసుపు దంతాలతో బాధపడే వారు తప్పకుండా ఈ రెమెడీని పాటించేందుకు ట్రై చేయండి.