జీలకర్ర గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎందుకంటే రోజూ మనం మసాలాల్లో, తాళింపులుల్లో వాడుతూనే ఉంటాం. మనం తిన్న ఆహారాన్ని అరగించడానికి జీలకర్ర బాగా సహాయపడుతుంది.
ఇంకా జీలకర్ర వల్ల మనకు తెలియని ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. బరువు తగ్గడం మొదలు ఎన్నో జీర్ణ సమస్యల వరకూ ఎన్నో సమస్యలు వీటితో చెక్ పెట్టవచ్చు. మరి అవేంటో తెలుసుకుందామా.
-జీలకర్ర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. జీలకర్ర వల్ల చాలా సమస్యల నుండి బయట పడవచ్చు. ఉదయం లేచిన వెంటనే జీలకర్ర నీళ్లు తాగితే లాభం ఉంటుంది. బాడీని డిటాక్సీ ఫై చేయడానికి జీలకర్ర సహాయ పడుతుంది.
-చర్మ, మొటిమలు, మచ్చలు వంటి సమస్యలు ఉన్నవారు జీలకర్రను తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. వేయించిన జీలకర్ర పొడిని పేస్ట్ చేసి ముఖానికి రాసుకుంటే మీ ముఖానికి నిగారింపుతోపాటు మెుటిమలు వంటి సమస్యలు తొలగిపోతాయి.
మధుమేహ రోగులకు జీలకర్ర చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. జీలకర్ర రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో అద్భుతంగా పని చేస్తుంది. 8 చెంచాల వేయించిన జీలకర్ర పొడిని రోజుకు రెండు సార్లు తింటే డయాబెటీస్ అదుపులో ఉంటుంది.
-జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండె నొప్పుల రాకుండా సహాయపడుతుంది.
-ఒక కప్పు కాచిన నీటిలో జీలకర్ర విత్తనాలు, అల్లం, తేనె, తులసి ఆకులు వేసుకుని తాగడం వల్ల జలుబు నుండి సులువుగా ఉపశమనం లభిస్తుంది.
-జీలకర్ర పొడిని పొడిగా చేసుకుని మజ్జిగలో వేసుకుని తాగితే గర్భాశయ బాధలు తగ్గుతాయి.
-జీలకర్రను బాగా వేయించి కొద్దిగా ఉప్పు కలిపి తినటం వల్ల పొట్టనొప్పి, అజీర్ణం, మార్నింగ్ సిక్ నెస్, వాంతి వికారం, వంటి అనారోగ్యాలకు చెక్ పెడుతుంది.
జీలకర్రను నిమ్మరసంతో కలిపి సుర్యోదయం, సూర్యాస్తమ సమయంలో రెండుపూటలా తింటే.. తలతిప్పడం, కడుపులో వేడిని సమస్యలను తగ్గిస్తుంది.
-జీలకర్ర రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఇది యాంటీ-ఆక్సిడెంట్ గుణాన్ని కలిగి ఉండటం వల్ల శరీరంలో చేరిన మురికిని, బ్యాక్టీరియాను తొలగిస్తుంది.