13 నుంచి అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌

www.mannamweb.com


– సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్స్‌లో మూడురోజుల పాటు నిర్వహణ

– హాజరుకానున్న 50 మంది ఇంటర్నేషనల్‌ కైట్‌ ఫ్లయర్స్‌

– రాత్రి పూట సందడి చేయనున్న రిమోట్‌ కైట్స్‌..

హైదరాబాద్‌ సిటీ: పతంగుల పండుగకు వేళయింది. సంక్రాంతి పండుగ(Sankranti festival) నేపథ్యంలో నగరంలో ఈనెల 13 నుంచి మూడురోజుల పాటు 7వ అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర పర్యాటక, భాషా సాంసృతిక శాఖ ఏర్పాట్లు చేస్తోంది. అంతర్జాతీయ, అంతర్రాష్టాల్లో పతంగులు ఎగురవేసే కైట్‌ ఫ్లయర్స్‌ను ఆహ్వానిస్తూ హైదరాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో ఈ వేడుకలను నిర్వహిస్తోంది.

మునుగోడులో దొంగల హల్‌చల్‌

పతంగుల పండుగకు ఇండోనేషియా, స్విట్జర్లాండ్‌, ఆస్ర్టేలియా, శ్రీలంక, కెనడా, కంబోడియా, స్కాట్లాండ్‌, థాయిలాండ్‌, కొరియా, ఫిలిప్పీన్స్‌, వియత్నాం, మలేషియా, ఇటలీ, తైవాన్‌, సౌత్‌ ఆఫ్రికా, నెదర్లాండ్స్‌, తదితర దేశాలకు చెందిన 50మంది కైట్‌ ఫ్లయర్స్‌ హాజరవుతున్నారు. కాగా, వీరితో పాటు గుజరాత్‌, పంజాబ్‌, తమిళనాడు, కేరళ(Tamil Nadu, Kerala), హరియాణా, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ తదితర రాష్ర్టాలకుకు చెందిన 60 మంది క్రీడాకారులు తరలిరానున్నారు. వీటిని తిలకించే సందర్శకుల కోసం షామియానా టెంట్లు, తాగునీటి ఏర్పాట్లను చేస్తున్నామని, పిల్లల కోసం ఆట వస్తువులను అందుబాటులో ఉంచామని అధికారులు తెలిపారు. ప్రతిరోజూ ఉదయం 10 నుంచి రాత్రి 8 గంటల వరకు పతంగుల ప్రదర్శన ఉండనుంది.

నోరూరించనున్న స్వీట్లు..

కైట్‌ ఫెస్టివల్‌తో పాటు స్వీట్ల పండుగను నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తెలుగు ప్రజలు ఇళ్లలో తయారు చేసుకునే పిండి వంటలతో పాటు ఇతర రాష్ర్టాలకు చెందిన సంప్రదాయ వంటలు, స్వీట్లను ఇందులో పరిచయం చేయనున్నామని, ఈ మేరకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మొత్తం 1100 జాతీయ, అంతర్జాతీయ స్వీట్లు, పిండి వంటలను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొన్నారు. ఈసారి ఇరాన్‌, తుర్కియే, అప్ఘనిస్తాన్‌తో పాటు మరో తొమ్మిది దేశాలకు చెందిన 700 మంది హోమ్‌ మేకర్స్‌ ప్రదర్శనలో పాల్గొననున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాలకు సుమారు 15 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందని, ఉచిత ప్రవేశం ఉంటుందని అధికారులు తెలిపారు.