మోకాళ్ల నొప్పులు వేధిస్తున్నాయా? ఆపరేషన్, మందులు వాడకుండా.. ఈ ఒక్క పనిచేస్తే చాలు

Knee Pains : మీరు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? ఈ నొప్పులకు శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నారా? ఇక ఏ మాత్రం చింతించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మోకాళ్ల నొప్పుల నుంచి శాశ్వతంగా బయటపడేందుకు శాస్త్రవేత్తలు సులువైన మార్గాన్ని కనుగొన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం.


సాధారణంగా మోకాళ్ల నొప్పులు అనేవి ఆస్టియో ఆర్థరైటిస్ అనే వ్యాధి కారణంగా వస్తుంటాయి. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఈ ఆస్టియో ఆర్థరైటిస్ జబ్బు వల్ల కీళ్లనొప్పులతో బాధపడుతూ ఉంటారు. ముఖ్యంగా మోకాలి ప్రదేశంలో ఈ నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పులు సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. నొప్పి కారణంగా నడవడానికి చాలా ఇబ్బంది కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో శస్త్ర చికిత్స కూడా చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది.

తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన ఒక వైద్య బృందం జరిపిన పరిశోధనలో ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి నుంచి బయట పడాలంటే శారీరక వ్యాయామం తప్పనిసరి అని తేలింది. ఇందులో వాకింగ్ జాగింగ్, రన్నింగ్ వంటి నడకకు సంబంధించిన ఎక్సర్ సైజులు ప్రధానం అని తేల్చారు. ఈ కీళ్ల నొప్పులకు ప్రధాన కారణం జీవనశైలిలో వచ్చిన మార్పులే అని కూడా నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా నిశ్చలమైనటువంటి జీవన విధానము, శారీరక శ్రమ లేకపోవడం కూడా ఈ కీళ్ల నొప్పులకు కారణంగా వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే రెగ్యులర్ గా శారీరక శ్రమను మీ జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలని కూడా వైద్య నిపుణులు సూచిస్తున్నారు.ముఖ్యంగా ఏదైనా ఒక క్రీడను అలవాటు చేసుకోవడం. మీ నిత్యజీవితంలో నడకకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి నుంచి బయటపడవచ్చు అని వైద్య నిపుణులు సలహా ఇస్తున్నారు. దీంతోపాటు యోగా, స్ట్రెస్టింగ్ ఎక్సర్సైజులు, గార్డెనింగ్, లిఫ్ట్ వాడకుండా మెట్లు ఎక్కడం వంటివి అలవాటు చేసుకోవాలని కూడా నిపుణులు సూచిస్తున్నారు.

మోకాళ్ల నొప్పుల బారిన పడకుండా ఉండాలంటే తొడ కండరాలను బలపరుచుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందుకు కాలినడకను మించిన వ్యాయామం లేదని కూడా ఈ అధ్యయనంలో తేలింది. గంటల తరబడి ఒకే ప్రదేశంలో కూర్చోవడం ద్వారా కూడా అనేక జబ్బులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందులో ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఒకటని నిపుణుల అభిప్రాయం. అందుకే మీరు పని చేసే వర్క్ ప్లేస్‌లో కూడా నిరంతరం కూర్చోకుండా మధ్య మధ్యలో లేచి నిలబడటంతో పాటు నడుస్తూ ఉండాలని.. అప్పుడే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ వ్యాధి బారిన పడకుండా మీ శరీరాన్ని జాగ్రత్తపరుచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.