Know it : ఫ్రిజ్‌కు గోడకు మధ్య ఎంత గ్యాప్‌ ఉంటే కరెంట్‌ బిల్లు తక్కువగా వస్తుంది..?

www.mannamweb.com


వంట గదిలో ఫ్రిడ్జ్‌, హాల్లో టీవీ లేని ఇళ్లు ఉండదు కదా..! ఇవి ఇప్పుడు చాలా కామన్‌ అయిపోయాయి. ఫ్రిడ్జ్‌లో అయితే పనికొచ్చేవి కంటే.. పాడైపోయినవే ఎక్కువగా ఉంటాయి.

చిన్నసైజ్‌ కర్రీపాయింట్‌ను మెయింటేన్ చేస్తుంది అమ్మ.. నిజమే కదా..! ఫ్రిడ్జ్‌, ఏసీ, వాషింగ్ మిషన్‌ వీటిని కండీషన్‌ బాగుంటేనే కరెంట్‌ బిల్లు తక్కువగా వస్తుంది లేదంటే.. అంతే సంగతులు. కొన్నిసార్లు ఇవి మంచి కండీషన్‌లో ఉన్నా.. మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల కరెంట్‌ బిల్లు ఎక్కువగా వస్తుంది. ఫ్రిడ్జ్‌ను హాల్లో ఉంచినా, వంటగదిలో ఉంచినా..ఫ్రిజ్, గోడ మధ్య దూరం చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ఒక్క తేడానే కరెంట్‌ బిల్లును పెంచుతుంది, తగ్గిస్తుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫ్రిజ్, గోడ మధ్య 6 నుండి 10 అంగుళాల ఖాళీ ఉండాలి. మీ ఫ్రిజ్ గోడకు చాలా దగ్గరగా ఉంటే అది వేడెక్కుతుంది, పనిచేయదు. వేడి సరిగా బయటకు వెళ్లలేక ఎక్కువ విద్యుత్ తీసుకుంటుంది. ఈ కారణంగా సమస్యలను నివారించడానికి గోడ నుండి సరైన దూరంలో మీ ఫ్రిజ్‌ను పెట్టాలి.

మీ ఫ్రిజ్‌ను చల్లబరచడానికి గాలి ప్రసరణ అవసరం. గాలి ప్రవాహానికి తగినంత స్థలం లేనట్లయితే కంప్రెసర్ వేడెక్కుతుంది. చివరికి పని చేయడం ఆగిపోతుంది. ఫ్రిజ్‌ లోపల కూడా సరైన సర్క్యులేషన్ లేకపోతే మీ ఆహారం త్వరగా పాడవుతుంది. ఫ్రిజ్ ఇంటిలో ఎక్కువగా విద్యుత్ ఉపయోగించే వస్తువులలో ఒకటి. ఎందుకంటే ఇది 24*7 ఆన్‌లోనే ఉంటుంది. టీవీ,ఏసీల్లా అవసరం లేనప్పుడు బన్‌ చేయనికీ కాదు. ఇది సాధ్యమైనంత సమర్థవంతంగా నడుస్తుందని నిర్ధారించుకోవడం చాలా ముఖ్యం.

ఫ్రిజ్‌ను ఉపయోగించేటప్పుడు గుర్తుంచుకోవలసిన ఇతర అంశాలు

ఫ్రిజ్‌ని ఎక్కువగా నింపవద్దు. ముఖ్యంగా మీకు అవసరం లేనప్పుడు ఎక్కువ ఆహారాన్ని ఫ్రిజ్‌లో నిల్వ చేయవద్దు.

ఫ్రిజ్‌లో గట్టి ప్లాస్టిక్ ర్యాప్‌ను ఉంచవద్దు. దీంతో ఫ్రిజ్‌లో వేడి పెరుగుతుంది. ఫ్రిజ్‌ డోర్‌ను పదే పదే తెరిచి ఉంచవద్దు. ఇది కూడా అధిక విద్యుత్ బిల్లుకు కారణం అవుతుంది.

చాలా మంది ఇంటికి దగ్గరలోనే షాపులు ఉన్నా.. సామాను ఎక్కువగా తీసుకొచ్చి ఫ్రిజ్ లో పెడుతుంటారు. ఇలా చేయడం కూడా మంచి పద్ధతి కాదు. ఎక్కువ ఐటమ్స్ ఫ్రిజ్‍లో ఉంటే కరెంట్ బిల్లు పెరుగుతుంది. అందుకే ప్రతిదాన్ని ఒకేసారి షాపింగ్ చేయడానికి బదులుగా.. తక్కువ పరిమాణంలో కొనాలి. దీంతో ఫ్రిజ్‍లో అనవసరమైన వస్తువులను నింపకుండా ఉండొచ్చు.