నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఎంత నీరు తాగితే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులోనూ ప్రస్తుతం సమ్మర్ కాబట్టి.. నీటిని మరింత ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే.. చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే వేసవి తాపం నుంచి బయట పడేందుకు చాలా మంది.. ఫ్రిజ్‌లోని వాటర్ తాగుతూ ఉంటారు. కానీ ఫ్రిజ్ వాటర్ ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు..
నీళ్లు తాగడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఎంత నీరు తాగితే అన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అందులోనూ ప్రస్తుతం సమ్మర్ కాబట్టి.. నీటిని మరింత ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే.. చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు వెళ్లిపోతుంది. దీంతో డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఉన్నాయి. అయితే వేసవి తాపం నుంచి బయట పడేందుకు చాలా మంది.. ఫ్రిజ్‌లోని వాటర్ తాగుతూ ఉంటారు. కానీ ఫ్రిజ్ వాటర్ ఎక్కువగా తీసుకోకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫ్రిజ్ వాటర్ కంటే.. కుండలోని నీటిని తాగడం చాలా ఆరోగ్యం అని, శరీరానికి ఎంతో మేలు చేస్తుందని అంటున్నారు. మరి కుండ నీళ్లు తాగితే ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
నేచురల్‌గానే చల్లగా ఉంటాయి:
కుండలోని నీరు సహజంగానే చాలా చల్లగా ఉంటాయి. ఫ్రిజ్ లోని వాటర్ కంటే ఇవి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఫ్రిజ్‌లోని చల్లని నీరు తాగితే చాలా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ కుండ నీరు తాగితే శరీరానికి చలువ చేస్తుంది.
రోగ నిరోధక శక్తి పెరుగుతుంది:
ఇప్పుడంటే వంట పాత్రల్లో ఎన్నో రకాలు వచ్చాయి. కానీ పూర్వం మాత్రం అన్నీ మట్టి కుండల్లోనే చేసేశారు. నిల్వ ఉంచే పదార్థాలు సైతం వీటిల్లోనే ఉండేవి. మట్టి పాత్రల్లో చాలా రకాల పోషకాలు ఉంటాయి. విటమిన్లు, ఖనిజాలు లభిస్తాయి. కాబట్టి ఇవి శరీరానికి చాలా మంచిది. శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా వ్యాధులతో పోరాడే శక్తి మీకు లభిస్తుంది.
గొంతు నొప్పి – జలుబు రావు:
కుండ నీరు తాగడం వల్ల గొంతు నొప్పి, జలుబు, వేడి చేయడం వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అదే ఫ్రిజ్‌లోని వాటర్ తాగితే గొంతు నొప్పి, జలుబు వంటివి త్వరగా ఎటాక్ చేస్తాయి. మట్టి కుండలోని నీటిని తాగితే.. ఈ సమస్యలు దూరం అవుతాయి.
జీర్ణ క్రియ మెరుగు పడుతుంది:
కుండలను బంక మట్టితో తయారు చేస్తారు. కాబట్టి ఇవి సహజంగానే ఆల్కలీన్.. కాబట్టి ఇందులో నిల్వ చేసిన నీరు పీహెచ్ లెవల్స్ కంటే బ్యాలెన్స్‌గా ఉంటాయి. కాబట్టి జీర్ణ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి. ఈ నీటిని తాగడం వల్ల జీర్ణ క్రియ అనేది మెరుగు పడుతుంది. అలాగే మల బద్ధకం వంటి సమస్య కూడా తగ్గుతుంది
ఎలాంటి బ్యాక్టీరియా ఉండవు:
సాధారణ నీటి కంటే.. కుండలోని నీటిలో ఎలాంటి కెమికల్స్ అనేవి ఉండవు. మట్టికుండ.. నీటిలోని సూక్ష్మ జీవులకు వ్యతిరేకంగా పోరాడతాయి. కాబట్టి ఈ నీటిలో వైరస్, బ్యాక్టీరియా వంటివి ఉండవు. జబ్బుల బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుంది.