Koya Language Wedding card
ఏ జాతి మనుగడకైనా..మాతృభాష(Mother Tongue) జీవనాడి వంటింది. అందుకే కవి..రచయితలు అమ్మభాష తల్లి పాల వంటిది..పరాయి భాష పోత పాల వంటిందంటారు. ఆధునిక విద్య..ఉపాధి వేటల ఒరవడిలో భారతదేశంలోని అనేక మాతృభాషలు క్రమంగా అంతరించిపోతున్న నేపథ్యంలో ఓ కోయ యువకుడు మాత్రం మాతృభాషపై తనకున్న అభిమానాన్ని ప్రత్యేకంగా చాటుకున్నాడు. ప్రతి మనిషి జీవితంలో ఎంతో ప్రత్యేకంగా భావించే పెళ్లి వేడుకను మాతృభాష చాటింపు వేదికగా చేసుకుని తన భాషాభిమానాన్ని చాటుకున్నాడు.

వరుడు ఉండం శ్రీనివాస్ తన మాతృభాషయైన కోయ భాషలో ముద్రించి బంధుమిత్రులను పెళ్లికి ఆహ్వానిస్తున్నాడు. పెళ్లి శుభలేఖలో వధువు, వరుడు పదాలతో సహా, ముహుర్తం, ఆతిథులకు ఆహ్వానం, విందు తదితర వివరాన్నింటికి కూడా కోయ భాషలోనే ముద్రింపచేసి అందరికి పెళ్లి పిలుపు శుఖలేఖలను పంపించాడు.
కోయ భాషలో ఆ యువకుడు రూపొందించుకున్న ఈ పెళ్లి శుభలేఖ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కోయ భాషలో పెళ్లి శుభలేఖను చూసిన నెటిజన్లు యువకుడి మాతృభాషాభిమానాన్ని అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అంతరించిపోయే జాబితాలో ఉన్న ఆదివాసీ, గిరిజనుల మాతృభాషాల పరిరక్షణ కోణంలో వినూత్నంగా వరుడు శ్రీనివాస్ కోయభాష పెళ్లి శుభలేఖ మంచి ప్రయత్నమని ప్రశంసిస్తున్నారు.