Kuldevta Spiritual Tips: కుల దైవం అంటే ఏమిటి..? కులదైవం ప్రాముఖ్యత.. ఎందుకు పూజిస్తారో తెలుసా

www.mannamweb.com


హిందువులకు ఆధ్యాత్మిక చింతన ఎక్కువ.. తమ కష్టాలకు సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని.. మానసిక ప్రశాంతంగా జీవిస్తామని.. దైవం మనల్ని రక్షిస్తాడని విశ్వాసం.
కొన్ని కుటుంబాలు మూలపురుషులు ఏ దైవానుగ్రహమో, మహాత్ముల అనుగ్రహమో విశేషంగా పొంది ఉంటారు. అప్పుడు వారు ఆయా దేవుళ్లను తమ కుల దైవంగా భావించి పూజిస్తారు. పెద్దలు చెప్పిన ప్రకారం రోజు లేదా ఇంట్లో ఏ శుభకార్యాలు తలపెట్టినపుడు తప్పకుండ తమ కులదైవాన్ని పూజిస్తారు. తమ కులదైవాన్ని పూజించకపోతే.. ఇబ్బందులు, అనర్థాలు ఏర్పడవచ్చు అని భయం ఉంటుంది. కనుక తమ కుల దైవాన్ని అత్యంత శ్రద్ధగా నియమ నిష్టలతో పూజిస్తారు. అయితే కొందరికి స్థానిక గ్రామదేవతలు కులదేవతలుగా ఉంటారు. ఇలా హిందూ ధర్మంలో పనులలో లేదా రోజువారీ పూజలో కులదేవతల ఆరాధనకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. అయితే కుల దేవత అంటే ఏమిటి? వారి ఆరాధన ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

నేటి యువతకు కుల దైవము గురించి పెద్దగా తెలియక పోయి ఉండవచ్చు. అయితే తాజాగా ‘ది సైబర్ జీల్’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాతో సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ‘యువర్ పర్సనల్ గాడ్’ అనే పోస్ట్‌ను పోస్ట్ చేశాడు. అందులో కులదేవతల విషయంపై సమాచారం ఇచ్చారు.
కుల దైవం అంటే ఏమిటంటే?

అందరి కుటుంబం ఎక్కడో ఒకచోట మొదలైందనేది జగమెరిగిన సత్యం. ఒక సమూహం నుండి వంశం మీ తరానికి విస్తరించబడి ఉండవచ్చు. ఈ వంశం ఎక్కడ మొదలైందో అక్కడ నుంచి తరతరాలుగా ఏదో ఒక దేవతను పూజిస్తూనే ఉంటారు.. అలాంటి దైవాన్ని కులదైవం లేదా దేవత అంటారు.

మీరు కులదేవి లేదా దైవాన్ని ఎందుకు పూజించాలంటే?

ఆధ్యాత్మికతను విశ్వసించే వ్యక్తులు.. సానుకూలత ఒకే చోట కేంద్రీకృతమై ఉండాలని విశ్వసిస్తారు. అప్పుడు జీవితంలో లేదా కుటుంబంలో సానుకూల ఫలాలను ఇవ్వడం ప్రారంభిస్తుందని భావిస్తారు. కులదేవి, దేవతలపై ఉంచిన విశ్వాసానికి సంబంధించి కూడా అదే భావన ఉంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

గమనిక: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. దీనికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. పాఠకుల ఆసక్తిని, నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సమాచారం అందిస్తున్నాం.)