హైదరాబాద్ అంటే.. ఫుడ్ బిజినెస్‌కు కేరాఫ్ అడ్రస్. తక్కువ బడ్జెట్‌లో మంచి ఫుడ్ తినాలంటే హైదరాబాద్‌కు మించిన ప్లేస్ మరొకటి ఉండదు. ఇక హైదరాబాదీ ఫేమస్ బిర్యానీని ప్రపంచమంతా ఇష్టపడుతుంది.
ఈ మధ్యకాలంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ కూడా విపరీతంగా పెరిగింది. సంపన్నులు సైతం రోడ్డు సైడ్ ఫుడ్‌ని ఆస్వాదిస్తున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని.. ఈ మధ్యకాలంలో నాన్‌వెజ్ వంటకాలతో బాగా ఫేమస్ అయ్యింది కుమారి ఆంటీ. ఆమె అసలు పేరు.. దాసరి సాయికుమారి. ఆంధ్రాలోని గుడివాడ ప్రాంతానికి చెందిన ఈమె.. 2011 నుంచి స్ట్రీట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. రుచికరమైన వెజ్‌లో దాల్ రైస్, గోబీ రైస్, గోంగూర రైస్, టమాటా రైస్ జీరా రైస్, కర్డ్ రైడ్ ఉంటాయి. వెజ్ వంటలతో పాటు చికెన్, మటన్, ఫిష్, ఫ్రాన్స్, తలకాయ, లివర్ ఇలా అన్ని నాన్ వెజ్ వంటలు ఆమె దగ్గర లభిస్తాయి. హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్ హోటల్ ఎదురుగా ఆమె ఫుడ్ స్టాల్ ఉంటుంది. 5 కేజీలతో ప్రారంభమైన కుమారి ఫుడ్ బిజినెస్.. ప్రస్తుతం క్వింటాల్‌కు చేరుకుంది. మధ్యాహ్నం 12 గంటలకు స్టార్టయి.. 3 గంటలకు క్లోజ్ అవుతుంది. నాన్ వెజ్ తినాలంటే కాస్త ఎర్లీగా వెళ్లాల్సిందే. రోజుకు 6వందల నుంచి 7వందల మంది తమ దగ్గర ఫుడ్ తింటారని చెప్తోంది కుమారి ఆంటీ. 600 వందల మంది కస్టమర్స్‌కు యావరేజ్ 100 రూపాయలు లెక్కన వేసుకున్నా.. రోజుకు 60000 కౌంటర్ ఉంటుంది. అన్ని ఖర్చులు పోతే 20 వేలు మిగలవచ్చు. ఈ లెక్కన ఆమెకు నెలకు 6 లక్షల వరకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది.
రేట్లు ఇలా…
చికెన్ కర్రీ, చికెన్ లివర్, బోటీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై — ఒక కర్రీతో మీల్స్ తీసుకుంటే 120 రూపాయలు, 2 కూరలతో తీసుకుంటే 180, 3 కూరలతో అయితే 250
చికెన్ ఫ్రై రైస్ అయితే రూ.150 (ఇంకో కర్రీ యాడ్ చేసుకుంటే రూ. 70 ఎక్స్ ట్రా)
మటన్ లివర్‌తో రైస్ రూ.150 (ఇంకో కర్రీ యాడ్ చేసుకుంటే రూ. 70 ఎక్స్ ట్రా)
మటన్ హెడ్ రైస్ రూ.150 (ఇంకో కర్రీ యాడ్ చేసుకుంటే రూ. 70 ఎక్స్ ట్రా)
ప్రాన్స్ కర్రీతో రైస్ రూ. 150 (ఇంకో కర్రీ యాడ్ చేసుకుంటే రూ. 70 ఎక్స్ ట్రా)
మటన్ కర్రీతో రైస్ రూ. 200 (ఇంకో కర్రీ యాడ్ చేసుకుంటే రూ. 70 ఎక్స్ ట్రా)
ఆమె వద్ద ఉన్న అన్ని నాన్ వెజ్ ఐటమ్స్‌తో రైస్ తీసుకుంటే రూ. 450
వెజ్ మాత్రమే తింటే ప్లేటు 80
కుమారి ఆంటీ ఫుడ్ తినేందుకు హైదరాబాద్ నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఫుడ్ లవర్స్ వస్తున్నారు. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఆమె వీడియోలు వైరల్ అవ్వడంతో.. జనాలు తాకిడి పెరిగింది. ఇక ఆమె ఫుడ్ రేట్లు అధికం అంటూ పలు మీమ్స్ సైతం వైరల్ అవుతున్నాయి.