మన భారతదేశంలో తులసి రావి చెట్లను దేవతల్లా భావిస్తారు. అలాంటి చెట్ల ఆకులతో మనం కోరిన కోరికలను నెరవేర్చుకోవచ్చని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.. మనం ప్రతి రోజు స్నానం చేసే నీళ్లలో నాలుగు తులసి ఆకులు వేసుకుని చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. అలా స్నానం చేసిన తర్వాత ఇంట్లోని తులసి కోట వద్ద మట్టిని తీసుకొని మంచి గంధంతో కలిపి నుదుట బొట్టు లాగా పెట్టుకోవాలి.
అంతేకాకుండా తులసి కోటలో కొన్ని నల్ల ఉమ్మెత్త గింజలను చల్లితే అవి చిన్న చిన్న మొక్కలుగా పెరుగుతాయి. అలా పెరగడం వల్ల మీకు లక్ష్మీదేవి కటాక్షం కలిగి విపరీతమైన ధన ప్రాప్తి లభిస్తుందని అంటున్నారు. అంతేకాకుండా రావి ఆకుతో కూడా మీకున్న కోరికలు నెరవేరుతాయట. గురువారం లేదా శుక్రవారం రోజు ఒక రావి ఆకు తీసుకొని, ఆకును శుభ్రంగా నీళ్లతో కడిగి ఆ తర్వాత రావి చెట్టు పుల్ల తీసుకొని, దాన్ని తడి పసుపులో ముంచి రావి ఆకు పైభాగాన ఓం అని రాసి, ఆ తర్వాత మీ మనసులో ఉన్న కోరికను ఆకుపై రాయండి, ఆ తర్వాత ఓం నమో భగవతే వాసుదేవాయ అని రాయండి.
ఆ తర్వాత రావిఆకును మీ పూజ గదిలో సాయంత్రం వరకు పెట్టండి. ఇక సాయంకాల సమయంలో ఆ రావి ఆకుకు దూపం చూపించి, ఆ తర్వాత దాన్ని తీసుకొని చెట్టు మొదట్లో లేదంటే ఏదైనా పారే నీళ్లలో వేయండి. ఇది ఎవరు కూడా తొక్కనిచోట వేస్తే కోరిక తప్పకుండా నెరవేరుతుందని శాస్త్ర పండితులు తెలియజేస్తున్నారు.