గ్రూప్ -1 టాపర్ గా లక్ష్మీదీపిక ..ఫైనల్ లిస్ట్ రిలీజ్ చేసినTGPSC

గ్రూప్ 1 ఫైనల్ లిస్టు రిలీజ్ అయింది. మొత్తం 563 పోస్టులకు గాను 562 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. గ్రూప్ 1 టాపర్‌గా లక్ష్మీదీపిక నిలిచారు.


బుధవారం అర్ధరాత్రి ఫైనల్ లిస్టును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) చైర్మన్ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. లిస్టును టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో పెట్టారు. గతేడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్‌ 1 మెయిన్స్ పరీక్షలు జరిగాయి. 21 వేల మందికి పైగా పరీక్షలకు అటెండ్ అయ్యారు. జనరల్ ర్యాంకింగ్ లిస్టు (జీఆర్ఎల్)ను మార్చిలో రిలీజ్ చేశారు. ఇప్పటికే నాలుగు విడతలుగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేశారు.

అయితే గ్రూప్‌ 1 రిక్రూట్‌మెంట్‌ను నిలిపివేస్తూ ఇటీవల హైకోర్టు సింగిల్ బెంచ్‌ తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో టీజీపీఎస్సీ అప్పీల్ చేసింది. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్.. సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించింది. హైకోర్టు ఆదేశాలు అనుకూలంగా రావడంతో టీజీపీఎస్సీ కమిటీ అత్యవసరంగా సమావేశమైంది. గ్రూప్‌ 1 నియామకాలపైనే గ్రూప్ 2, గ్రూప్ 3 రిక్రూట్మెంట్ ఆధారపడి ఉండటంతో వెంటనే ఫైనల్ లిస్టు రిలీజ్ చేయాలని నిర్ణయించింది. దీనికి అనుగుణంగా బుధవారం అర్ధరాత్రి 562 మంది సెలక్షన్ లిస్టును విడుదల చేశారు. మల్టీజోన్ల వారీగా ఏ పోస్టుకు ఎవరు ఎంపికయ్యారనే వివరాలను వెబ్‌సైట్‌లో పెట్టారు. టాప్ టెన్ ర్యాంకర్ల పేర్లనూ కమిషన్ వెల్లడించింది. వీరంతా డిప్యూటీ కలెక్టర్లుగా ఎంపికైనట్టు ప్రకటించింది. అయితే, హైకోర్టులో
పెండింగ్‌లో ఉన్న కేసుల నేపథ్యంలో ఈ రిజల్ట్స్‌ ఫైనల్ జడ్జిమెంట్‌కు లోబడి ఉంటాయని కమిషన్ పేర్కొంది. తప్పుడు సమాచారంతో ఎంపికైన వాళ్లను ఏదశలోనైనా తొలగిస్తామని తెలిపింది.

టాపర్లు వీళ్లే.. ర్యాంకు పేరు

1 లక్షీదీపిక
2 దాడి వెంకటరమణ
3 వంశీ కృష్ణారెడ్డి
4 జిన్నా తేజస్వీని
5 సిద్దల కృతిక
6 హర్షవర్థన్
7 కే. అనూష
8 వై. నిఖిత
9 కే. భవ్య
10 శ్రీకృష్ణ సాయి

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.