నేటి ఆధునిక కాలంలో జీవన విధానంలో చాలామంది పని ఒత్తిడి కారణంగా సరైన సమయానికి భోజనం తినలేక పోతున్నారు. ఇలా రాత్రి సమయంలో భోజనాన్ని సరైన సమయంలో తినకపోవడం వలన అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు తెలియజేస్తున్నారు.
మరి రాత్రి సమయంలో భోజనం ఆలస్యంగా చేస్తే ఎటువంటి పరిణామాలు ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వైద్య నిపుణుల ప్రకారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో భోజనం చేయడం ఉత్తమమని ఇలా చేయడం వలన జీర్ణక్రియ చక్కగా జరుగుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా హార్మోన్ల సమతుల్యత మెరుగుపడుతుంది. అలాగే నిద్రించే రెండు మూడు గంటల ముందుగానే భోజనం చేయాలి. అప్పుడే మెరుగైన నిద్ర ఉంటుంది.
జీర్ణక్రియ సమస్య : రాత్రి సమయంలో ఆలస్యంగా ఆహారం తీసుకున్నట్లయితే అది సరిగా జీర్ణం అవ్వదు. గ్యాస్, అసిడిటీ, కడుపునొప్పి సమస్యలు వస్తాయి.
– బరువు పెరిగే ప్రమాదం : ఇలా ఆలస్యంగా భోజనం చేయడం వలన శరీరంలో క్యాలరీలను ఎక్కువగా ఖర్చు చేయకపోవడం వలన కొవ్వు పేరుకొని బరువు వేగంగా పెరుగుతారు.
– నిద్రలేని : రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేసిన వెంటనే నిద్రపోతే అది సరికొత్త జీర్ణం అవ్వదు. దీని కారణంగా నిద్రలో అంతరాయం ఏర్పడి నిద్రలేని సమస్యలు వస్తాయి.
– హార్మోన్ల ఆసమతుల్యత : ముఖ్యంగా రాత్రి సమయంలో ఆలస్యంగా తినడం వలన శరీరం లో అసమతుల్యతకు దారితీస్తుంది. దీని కారణంగా డయాబెటిక్స్ మానసిక ఒత్తిడి గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
-గుండె ఆరోగ్యం పై ప్రభావం : ఆలస్యంగా తినడం వలన కొలెస్ట్రాల్ స్థాయి అధికంగా పెరుగుతుంది అంతేకాకుండా రక్తపోటు సమస్య లు వచ్చే అవకాశం ఉంటుంది.
-జీర్ణక్రియ మెరుగుపడుతుంది అలాగే ఆహారం సరిగ్గా జీర్ణం అవుతుంది.
-ప్రశాంతమైన నిద్ర లభిస్తుంది. శరీరానికి విశ్రాంతి దొరుకుతుంది.
-బరువుని నియంత్రణలో ఉంచుకోవచ్చు.
-గుండె ఆరోగ్యం బాగుంటుంది.
-గ్యాస్ ఎసిడిటీ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
కాబట్టి రాత్రి సమయంలో భోజనం ఆలస్యంగా చేయడం వలన అనేక ఆరోగ్య ప్రమాదాలు ఉన్నాయి. అందువలన ప్రతిరోజు భోజనాన్ని సకాలంలో తీసుకోవడం వలన శారీర మరియు మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగిస్తుంది. సరైన జీవన విధానాన్ని పాటిస్తూ సరైన సమయానికి భోజనం చేయడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.