Late Night Sleeping: ఆలస్యంగా నిద్ర పోతున్నారా..రిస్క్ లో పడ్డట్టే

www.mannamweb.com


Late Night Sleeping: ఆరోగ్యంగా ఉండడానికి తగినంత నిద్ర ఎంతో అవసరం. ప్రస్తుతం మారుతున్న జీవన శైలి కారణంగా చాలా మంది ఆలస్యంగా నిద్ర పోతున్నారు. దీంతో ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. నేటి తరం లేట్​గా పడుకోవడం లేట్​గా నిద్రలేవడం వల్ల వ్యాధులను కోరి కొని తెచ్చుకుంటున్నారు. ఆలస్యంగా నిద్ర పోయేవారు ఎలాంటి అనారోగ్య సమస్యలను ఎదుర్కుంటున్నారో తెలుసుకుందాం.

పురుషులతో పాటు నేడు మహిళలు కూడా నైట్ షిఫ్ట్ ఉద్యోగాలు చేస్తున్నారు. లాంగ్ నైట్ షిఫ్ట్ కారణంగా పని ఒత్తిడితో వారు తీసుకునే ఆహారంపై సరైన శ్రద్ధ చూపించారు. దీంతో అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం ఎనిమిది గంటల పాటు నిద్ర పోవాలి. రాత్రి సమయాల్లో నిద్రపోకుండా పగలు ఎప్పుడు పడితే అప్పుడు నిద్ర పోవడం కూడా మంచిది కాదు. అందుకు అనేక కారణాలను వెల్లడిస్తునారు నిపుణులు.

యువత ఎలక్ట్రానిక్​ గాడ్జెట్లను ఉపయోగించడం వల్ల కూడా ఆలస్యంగా నిద్ర పోతున్నారు. స్మార్ట్​ఫోన్​, సోషల్​ మీడియా ప్రభావం యువతపై ఎక్కువగా ఉంటుంది. దీంతో వారు లేట్​గా పడుకొని ఉదయం లేట్​గా నిద్ర లేవడం వల్ల జీర్ణ వ్యవస్థ పని తీరు నెమ్మదిస్తుంది. భవిష్యత్తులో ఎసిడిటీ, ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి.

మధుమేహం: ఆలస్యంగా నిద్రించే వారికి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేట్ నైట్ నిద్రపోయే వారి దినచర్య అస్థవ్యస్తంగా మారుతుంది. వీరి జీవనశైలి మారిపోవడంతో రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది. ఆకలికి సంబంధించిన సమస్యలు ప్రారంభమవుతాయి. కార్బోహైడ్రేట్స్​ పెరిగి మధుమేహానికి గురవుతారు. అంతే కాకుండా మిగతా వారితో పోల్చితే వీరు చాలా లేజీగా కనిపిస్తారు.

గుండె జబ్బులు: ఆలస్యంగా నిద్రలేవడం వల్ల శరీరానికి అవసరమైన సూర్యరశ్మిని పొందలేరు. దీని వల్ల డి విటమిన్​ లభించక అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతే కాకుండా శరీరంలో హార్మోన్ల స్థాయి దెబ్బతింటుంది. రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్ శరీరంలో విపరీతంగా పెరుగుతాయి. దీంతో గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.

ఊబకాయం: ఆలస్యంగా నిద్ర లేచే అలవాటు ఉన్నవారిలో జీవక్రియలు మందగిస్తాయి. దీంతో వారు కేలరీలు బర్న్ చేయడంలో ఇబ్బందులు ఎదుర్కుంటారు. శరీరంలో కొవ్వు నిల్వలు పెరిగి ఊబకాయంకు దారితీస్తుంది. అధిక బరువు వల్ల కీళ్ల నొప్పులు మొదలవడంతో..నడవడానికి ఆయాసపడుతారు.