భారతదేశంలోని గ్రామీణ ప్రాంత పెట్టుబడిదారులు పోస్టాఫీసు పథకాల్లోపెట్టుబడికి ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే పోస్టాఫీసు పథకాలకు ఇచ్చే వడ్డీ రేటు ప్రతి త్రైమాసికానికి ప్రభుత్వం మార్పు చేస్తుంది.
2024 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి చిన్న పొదుపు పథకాలకు ప్రస్తుత వడ్డీ రేట్లను కొనసాగిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఈ కాలంలో ప్రస్తుతం ఉన్న రేట్లు మారవు. అయితే ఈ నిర్ణయం ద్వారా పోస్టాఫీసు పొదుపు పథకాలలో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్, పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్లు, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికెట్, పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ పథకాలు వడ్డీ రేట్లు మారవు. 2024-25 ఆర్థిక సంవత్సరం యొక్క మూడవ త్రైమాసికంలో వివిధ చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు అక్టోబర్ 1, 2024 నుండి ప్రారంభమై డిసెంబర్ 31, 2024తో ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆయా పథకాల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో? ఓసారి చూద్దాం.
పొదుపు పథకాల వడ్డీ రేట్లు ఇలా
సేవింగ్స్ డిపాజిట్4 శాతం
1 సంవత్సరం టైమ్ డిపాజిట్ 6.9 శాతం
2 సంవత్సరాల టైమ్ డిపాజిట్7 శాతం
3 సంవత్సరాల టైమ్ డిపాజిట్ 7.1 శాతం
5 సంవత్సరాల టైమ్ డిపాజిట్ 7.5 శాతం
5 సంవత్సరాల రికరింగ్ డిపాజిట్ 6.7 శాతం
సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2 శాతం
నెలవారీ ఆదాయ ఖాతా పథకం 7.4 శాతం
నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ 7.7 శాతం
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకం 7.1 శాతం
కిసాన్ వికాస్ పాట్నా7.5 శాతం
సుకన్య సమృద్ధి ఖాతా 8.2 శాతం
చిన్న పొదుపు పథకం వడ్డీ రేట్లు నిర్ణయాలు ఇలా
పోస్ట్ ఆఫీస్ పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం అనేక రకాల డిపాజిట్ పథకాలను అందిస్తుంది. వీటిని చిన్న పొదుపు పథకాలు అని కూడా పిలుస్తారు. ఈ పథకాలకు సార్వభౌమ గ్యారంటీని అందిస్తూ కేంద్ర ప్రభుత్వం మద్దతు ఇస్తుంది. ఎన్ఎస్‌సీ, ఎస్సీఎస్ఎస్, పీపీఎఫ్ వంటి పథకాలు ఆదాయపు పన్నుచట్టం, 1961లోని సెక్షన్ 80C కింద పన్ను-పొదుపు ప్రయోజనాలను కూడా అందిస్తాయి. ప్రభుత్వం ప్రతి త్రైమాసికంలో చిన్న పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది.
చిన్న పొదుపు పథకాల వడ్డీ తగ్గింపు ఎప్పుడు?
చిన్న పొదుపు పథకాల రేట్లను ప్రభుత్వం తగ్గిస్తుందని చాలా మంది తరచుగా అడుగుతూ ఉంటారు. గరిష్ట రేట్లు, యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజర్వ్ ఇటీవలి రేట్లు తగ్గించిన తర్వాత రేట్లను తగ్గించే పరిశీలించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నాు. 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికం నుండి పీపీఎఫ్ వడ్డీ రేటు మారలేదు. అదే సమయంలో యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజర్వ్ ఇటీవల 50 బీపీఎస్ రేటు తగ్గించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం చాలా చిన్న పొదుపు సాధనాల వడ్డీ రేట్లను 40 బీపీఎస్ నుంచి 150 బీపీఎస్ వరకు పెంచింది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ తన తదుపరి ద్రవ్య విధానంలో ఇదే మార్గాన్ని అనుసరిస్తుందా? లేదా అని పెట్టుబడిదారులు ఇప్పుడు ఆసక్తిగా ఉన్నారు.