అల్పపీడనం ఎఫెక్ట్.. ఇక వర్షాలే.. వర్షాలే.. లేటెస్ట్ వెదర్ రిపోర్ట్ ఇదిగో

www.mannamweb.com


తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు విస్తరంగా కురుస్తున్నాయి. ఈ క్రమంలో అమరావతి వాతావరణ కేంద్ర కీలక ప్రకటన చేసింది.. మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది..

తేలికపాటి నుంచి మోస్తరు లేదా భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.. ఈ మేరకు మంగళవారం ప్రకటన జారీ చేసింది.. 29 ఆగస్టు, 2024 నాటికితూర్పు మధ్య, ఆనుకుని ఉన్న ఉత్తర బంగాళా ఖాతంలో తాజా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. తదుపరి 2 రోజుల్లో ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ దక్షిణ ఒరిస్సా.. ఉత్తర ఆంధ్రప్రదేశ్ కు దగ్గరగా వెళ్లే అవకాశం ఉంది. దీంతోపాటు ఆంధ్రప్రదేశ్, యానాంలో దిగువ ట్రోపో ఆవరణములో పశ్చిమ దిశగా గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది.. రాబోవు మూడు రోజులకు వెదర్ రిపోర్ట్ చూడండి..

రాబోవు మూడు రోజులకు వాతావరణ సూచనలు:-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ & యానాం :-

మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేకచోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

మంగళవారం, బుధవారం తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

రాయలసీమ :-

మంగళవారం, బుధవారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము ఒకటి లేదా రెండుచోట్ల కురిసే అవకాశముంది. బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.

గురువారం తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షము లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఉపరితల గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాకాశముంది.