గత ఏడాది టాలీవుడ్ లో యంగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రాజ్ తరుణ్ (Raj Tarun), లావణ్య(Lavanya) కేసు ఎంత సంచలనం సృష్టించిందో ప్రతి ఒక్కరికి తెలుసు.
తనను ప్రేమించి, గర్భవతిని చేసి, అబార్షన్ చేయించి మోసం చేశాడు.. అంటూ లావణ్య అనే యువతి మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఇద్దరం కలిసి 10 సంవత్సరాలు ఒకే ఇంట్లో సహజీవనం చేసామని చెప్పిన ఆమె, ఒక హీరోయిన్ మోజులో పడి తనను దూరం పెట్టాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు, కోర్టు, దాడులు అంటూ గత ఏడాది నానా రచ్చ సృష్టించారు. ఆ తర్వాత ఇన్ని రోజులు సైలెంట్ అయిన లావణ్య.. ఇప్పుడు మళ్లీ బయటకు వచ్చి మస్తాన్ సాయి (Mastan Sai) పర్సనల్ విషయాలను బయటపెట్టింది. మత్తు, పెళ్లి, ప్రేమ పేరుతో దాదాపు 300 అమ్మాయిలను మోసం చేసి, వారి ప్రైవేటు వీడియోలను ఒక హార్డ్ డిస్క్ లో బంధించి, వారిని చిత్రవధకు గురి చేశారట. ఈ హార్డ్ డిస్క్ ను తీసుకెళ్లి లావణ్య పోలీసులకు అప్పజెప్పింది. దీంతో మస్తాన్ సాయి నుండి తనకు ప్రాణహాని ఉందని, తనకు ఎలాగైనా సరే రక్షణ కల్పించండి అని,ప్రాణ భిక్ష పెట్టండి అని, అవసరమైతే కాళ్లు పట్టుకుంటాను అంటూ కూడా భావోద్వేగానికి గురవుతోంది లావణ్య. అసలే ఏమైందో ఇప్పుడు చూద్దాం.
రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకుంటాను – లావణ్య
తాజాగా ఒక ప్రముఖ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లావణ్య మాట్లాడుతూ.. నా జీవితం మొత్తం కోల్పోయాను. నా మనిషిని కోల్పోయాను. రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకొని క్షమాపణ చెప్పాలని కోరుకుంటున్నాను. నేను ఏ వీడియోలు రిలీజ్ చేయలేదు. నాకు జరిగిన అన్యాయమే, ఇంకో అమ్మాయికి జరగకూడదు అనేదే నా తాపత్రయం. అవసరమైతే రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకొని క్షమాపణలు కూడా చెబుతాను. ఒకప్పుడు రాజ్ తరుణ్ నేను చాలా సంతోషంగా ఉండే వాళ్ళం. మస్తాన్ సాయి వల్లే మా మధ్య గొడవలు మొదలయ్యాయి. మస్తాన్ సాయితో ఉన్నప్పుడు నేను డ్రగ్స్ తీసుకున్నాను అంటూ అసలు విషయం చెప్పి కన్నీళ్లు పెట్టుకుంది లావణ్య
నాకు ప్రాణ భిక్ష పెట్టండి- లావణ్య..
ముఖ్యంగా మస్తాన్ సాయి వల్లే నా జీవితం ఇలా అయ్యింది. పదుల సంఖ్యలో అమ్మాయిల ప్రైవేట్ వీడియోలను రికార్డు చేశారు. చాలామంది జీవితాలతో మస్తాన్ సాయి ఆడుకున్నాడు. ముఖ్యంగా అమ్మాయిలను మత్తుకు బానిసలను చేశాడు. ఇక వారందరి జీవితాలను కాపాడడమే ధ్యేయంగా నేను రంగంలోకి దిగాను. ఇప్పుడు నా ప్రాణాలను తీస్తామని బెదిరిస్తున్నారు. ఏ క్షణం అయినా సరే నన్ను చంపేయొచ్చు. ప్రాణం ,మానంతో నేను పోరాడుతున్నాను .
ప్రస్తుతం నాకు సొసైటీ సపోర్టు ఉంటుందని అనుకున్నాను కానీ నాకు సొసైటీ నుండి ఎటువంటి సపోర్టు లభించడం లేదు. అయినా సరే పోరాటం చేస్తున్నాను. ముఖ్యంగా మస్తాన్ సాయి, వారి తల్లిదండ్రుల నుండి నాకు ప్రాణహాని ఉంది. నాకు ఏం జరిగినా వారిదే బాధ్యత. దయచేసి నాకు ప్రాణ భిక్ష పెట్టండి అంటూ లావణ్య వేడుకుంటుంది. ప్రస్తుతం లావణ్య చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ప్రతిక్షణం ప్రాణభయంతో బ్రతుకుతున్నానంటూ లావణ్య చెప్పిన మాటలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయని చెప్పవచ్చు.