అమ్మాయిలతో న్యూడ్ వీడియోల కేసులో నార్సింగ్ పోలీసులు (Narsing Police)కీలక స్టెప్ వేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మస్తాన్ సాయి(Mastan Sai)ని రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకున్నారు.
న్యూడ్ వీడియోల రికార్డింగ్, అమ్మాయిలతో పరిచయాలు, డ్రగ్స్(Drugs) సరఫరా, లావణ్య(Lavanya)తో ఉన్న సంబంధాలు తదితర వివరాలపై విచారణ చేపట్టనున్నారు. అయితే మస్తాన్ సాయిని కస్టడీలోకి తీసుకున్న ఈ సమయంలో లావణ్య అప్పటికప్పుడు కోకాపేట్‌లోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. తన కేసు వాదిస్తున్న అడ్వాకేట్‌తో కలిసి మీడియాతో మాట్లాడింది.
మస్తాన్ సాయి అమ్మాయిలను డ్రగ్స్‌కు అలవాటు చేసి బ్లాక్ మెయిల్ చేసే వాడని మరోసారి తెలిపింది. హార్డ్ డిస్క్ లో అన్ని వివరాలు ఉన్నాయని, వాటిని పరిశీలిస్తే ప్రతి అంశం తెలిసిపోతుందని లావణ్య వెల్లడించింది. మస్తాన్ సాయి ఇష్యూలో పోలీసుల విచారణలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయని, అతడి విషయం కోర్టులోనే తేల్చుకుంటానని తెలిపింది. అయితే తన వీడియోస్ గుర్తు తెలియని వ్యక్తులు వైరల్ చేస్తున్నారని ఆరోపించింది. సెప్టెంబర్‌లో నార్సింగ్ పోలీస్ స్టేషన్ డీఐ శ్రీనివాస్‌తో మాట్లాడింది నిజమేనని చెప్పింది. రాజ్ తరుణ్ కేసు విషయంపై మాట్లాడటం జరిగిందని, కానీ కొందరు తన అనుమతి లేకుండా వీడియోస్ వైరల్ చేస్తున్నారని కన్నీరు పెట్టుకుంది.
డీఐతో తన ఇంట్లో ఉండే మాట్లాడానని ఆ సమయంలో నా పక్కన మస్తాన్ సాయి కూడా ఉన్నాడని తెలిపింది. కేసు విషయం రాబట్టడానికే తానే అలా మాట్లాడానని, తనను కలుస్తా అన్నది కూడా అందుకేనని స్పష్టం చేసింది. కానీ డీఐ వేరే పార్టీలో ఉండి తనను కలిసేందుకు ఒప్పుకోలేదని వివరించింది. ఈ వీడియో సైతం పోలీసులకు అప్పగించిన హార్డ్ డిస్క్‌లో ఉందని, తను ఎలాంటి క్రైం చేయలేదని చెప్పుకొచ్చింది. తనను అన్యాయంగా కేసులో ఇరికించారని ఆ కేసు నుంచి బయట పడేందుకు మస్తాన్ సాయితో కలిసి డీఐతో మాట్లాడినట్టు లావణ్య వెల్లడించింది. కానీ కొందరు తన వీడియోలు, ఆడియోలను వైరల్ చేస్తూ తనను తప్పుడు మనిషిగా చిత్రీకరిస్తున్నారని లావణ్య కంటతడి పెట్టున్నారు. ఇకపై తను మరోసారి మీడియా ముందుకు రానని తేల్చి చెప్పింది. ఇదే సమయంలో రాజ్ తరుణ్ కుటుంబానికి లావణ్య మీడియా సమక్షంలో క్షమాపణలు తెలిపింది.