మన కూరగాయల మార్కెట్లో ఎక్కువగా కనిపించే వెజిటేబుల్స్ టమాటాలు. ఇవి ఒక్కోసారి అధిక ధరతో మార్కెట్లోకి వస్తాయి. ఒక్కోసారి తక్కువ ధరతో ఉంటాయి. టమాటాలు మార్కెట్లోకి భారీగా వచ్చిన నేపథ్యంలో ధర పడిపోతే వృథాగా పడేస్తారు. లేదా పశువులకు వేస్తారు. మన ఇంట్లోనూ ఒక్కోసారి టమోటాలు తెచ్చుకున్న సందర్భంలో అవి పాడైపోతే పారేస్తాము. అయితే యువకుడు ఇలా పడేసిన టమాటాలతో లెదర్ ప్రొడక్ట్ తయారు చేశాడు. దానితో హ్యాండ్ బ్యాగ్స్, బెల్టు, తదితర వస్తువులను తయారు తయారు చేస్తున్నాడు. ఇంతకీ ఆ వ్యక్తి ఎవరు? పాడైపోయిన టమాటాలతో లేదా ప్రోడక్ట్ ఎలా తయారు చేస్తున్నాడు?
సాధారణంగా లెదర్ ప్రోడక్ట్ తయారు కావడానికి జంతువుల చర్మం అవసరం ఉంటుంది. అంటే జంతువులను బలి ఇవ్వాల్సి వస్తుంది. ఈ విషయం తెలిసిన Pritesh Mystry కి చాలా బాధేసింది. అయితే తాను ముంబైలోని తడిమాల్ షహనీ ఇంజనీరింగ్ కాలేజ్ లో బయోటెక్నాలజీ చదివాడు. ఈ సందర్భంగా టమాటో ఉత్పత్తుల ద్వారా చర్మం తయారు చేయవచ్చు అని తెలుసుకున్నాడు. టమాటాలనుంచి Poli Uretain(PU), Vinile Cloride(VC) అనే ప్రక్రియతో బయోలిథెర్ అనే చర్మం తయారవుతుంది. దీని తయారీ వల్ల ఎలాంటి జంతువుకు నష్టం ఉండదు. అలాగే వృధా అయిపోయిన టమాటాలను మాత్రమే ఉపయోగించాల్సి వస్తుంది.
అయితే మిగతా కూరగాయల కంటే టమాటాలను మాత్రమే ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది? అనే సందేహం పై Pritesh ను కొందరు అడగగా.. మన దేశంలో సంవత్సరానికి 44 మిలియన్ టన్నుల టమాట ఉత్పత్తి అవుతుంది. అయితే ఇందులో 30 నుంచి 35% వరకు వృధా అవుతుంది. ఈ వృధాయే టమాటాలను చర్మ ఉత్పత్తులకు ఉపయోగించడం వల్ల ఎవరికి ఎలాంటి నష్టం ఉండదని భావించినట్లు ఆయన తెలిపారు. అలాగే టమాటాలలో పెక్టిన్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. ఇది సహజ పాలిమర్ మిస్రి. దీనిని ఉపయోగించడం వల్ల వస్తువుకు బలంగా ఉంటుంది. అలాగే దీని ద్వారా ఉత్పత్తి అయినా లెదర్ తో ఎలాంటి వస్తువునైనా తయారుచేసుకునే అవకాశం ఉంటుంది. అలాగే టమాటాలను ఉపయోగించడం వల్ల పర్యావరణ కాలుష్యం నుంచి కూడా రక్షించుకున్న వారవుతామని ఆయన పేర్కొన్నాడు.
ప్రితేష్ కళాశాలలో ఉండగానే చివరి సంవత్సరంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. దీంతో కాన్పూర్ లోని ప్రత్యేకంగా టమాటాలతో ఉత్పత్తి అయిన లెదర్ తో వస్తువులను తయారు చేయడం ప్రారంభించారు. ఆ తర్వాత ది బయో కంపెనీ ప్రారంభించారు. 2019లో ఈ కంపెనీ ప్రారంభించిన ఈ కంపెనీ మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ వంటి ప్రాంతాలలో ఎక్కువగా టమాటాలు సేకరిస్తున్నారు. గుజరాత్ లోని సూరత్ లో టమాటా ప్రాసెస్ తో బయో లెదర్ ను తయారు చేసి ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.































