చాలా మంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో లెమన్ వాటర్ తాగటం అలవాటుగా చేసుకున్నారు. ఇలా తీసుకుంటే..ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుందని దీంతో పాటు బరువును కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు..అయితే, లెమన్ వాటర్ కాకుండా లెమన్ కాఫీతో కూడా ఆరోగ్యంగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. దీంతో లాబాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
చాలా మంది లెమన్ వాటర్‌ను కేవలం బరువు తగ్గడానికి మాత్రమే తీసుకుంటారు. లెమన్ వాటర్ కేలరీలను కరిగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. నిమ్మకాయలో విటమిన్ ఎ, విటమిన్ సి, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే శరీరంలో ఉన్న విష పదార్థాలు, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.
లెమన్ కాఫీని రోజూ తాగితే ఆకలి నియంత్రణలో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీంతో శరీరంలో గుట్టలుగా పేరుకుపోయిన కొవ్వులను కరిగించి మీ బరువును తగ్గిస్తుంది. కాఫీ శరీరంలో శక్తిని పెంచి.. మెటబాలిజంను ప్రేరేపించి బరువు తగ్గేలా చేస్తుంది.
నిమ్మకాయలోని విటమిన్ సి పోషకాలను బాగా గ్రహించడంలో తోడ్పడుతుంది. దీనిని కాఫీలో కలిపి తీసుకోవటం వల్ల కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు ప్రయోజనకరమైన సమ్మేళనాలను బాగా గ్రహించడంలో హెల్ప్ చేస్తాయి. వీటి వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి.
కాఫీ, నిమ్మకాయల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. నిమ్మకాయలోని విటమిన్ సి శరీరంలోని ఫ్రీరాడికల్స్‌తో పోరాడుతుంది. శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి.. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. స్కిన్‌కి మంచి గ్లోని అందిస్తుంది. చర్మానికి హైడ్రేషన్‌ను అందించి చర్మం ముడతలు రాకుండా చేస్తుంది.
కాఫీలోని కెఫిన్ జీవక్రియ, ఆక్సీకరణను మెరుగుపరుస్తుంది. నిమ్మకాయ కూడా జీవక్రియను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఈ రెండు తీసుకోవడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది. కానీ.. ఎక్కువగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది ఎసిడిటీ సమస్యలకు దారి తీస్తుంది.