భారతదేశంలో బీమా రంగంలో ఎల్ఐసీ అత్యంత ప్రజాదరణ పొందింది. ఎప్పటికప్పుడు సరికొత్త పాలసీలను ప్రకటిస్తూ అగ్రగామిగా నిలుస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కుమార్తెల కోసం సరికొత్త పాలసీను ప్రకటించింది. ప్రతి నెల రూ.3600 మొత్తాన్ని డిపాజిట్ చేస్తే మీకు రూ.28 లక్షల రిటర్న్ వచ్చేలా కొత్త పాలసీను అందిస్తుంది. కన్యాదాన్ పేరుతో లాంచ్ చేసిన ఈ పాలసీ కుమార్తెల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకునే వారి కోసం ప్రత్యేకంగా రూపొందించారు. ఈ నేపథ్యంలో ఎల్ఐసీ కన్యాదాన్ పాలసీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ పథకంలో పెట్టుబడి పెడితే వారి కుమార్తెల వివాహానికి ఎలాంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా ఈ పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా రూ.28 లక్షలను పొందవచ్చు. రోజుకు రూ. 121 డిపాజిట్ చేయడం అంటే నెలకు సుమారుగా రూ.3600 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకంలో మీ పిల్ల ఒక సంవత్సరం వయస్సు నుంచి 25 సంవత్సరాల మధ్య డబ్బు పెట్టుబడి పెట్టవచ్చు. ముఖ్యంగా కన్యాదాన్ పాలసీదారుడు మధ్యలో మరణిస్తే ఆ కుటుంబ సభ్యులు బీమా కంపెనీ నుండి రూ. 10 లక్షల మొత్తాన్ని పొందుతారు. అదనంగా మీరు ఇందులో ఎక్కువ డబ్బు డిపాజిట్ చేయవలసిన అవసరం లేదు
కుమార్తెల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఎల్‌ఐసీ కన్యా దాన్ పాలసీని రూపొందించారు. కుమార్తె వయస్సు కనీసం 1 సంవత్సరం అలాగే తండ్రి వయస్సు 30 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టడానికి అర్హత ఉంటుంది. అలాగే ఇందులో పెట్టుబడి పెడితే మీకు మంచి మొత్తంలో పన్ను మినహాయింపు లభిస్తుంది. ఆదాయపు పన్ను చట్టం 1961 కింద 80సీ కింద పాలసీదారులు రూ. 1.5 లక్షల వరకు తగ్గింపును పొందవచ్చు.