భారతదేశంలో నమ్మకమైన బీమా సంస్థల్లో లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ముందువరుసలో ఉంటుంది. చాలా ఏళ్లుగా ఎల్ఐసీ భారతీయుల నమ్మకాన్ని గెలుచుకుంది. ఎల్ఐసీ పాలసీ ఉంటే జీవితానికి ఆర్థిక భద్రత ఉన్నట్లేనని సాధారణ ప్రజలు అనుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఈ నమ్మకాన్ని ఒమ్ము చేసేలా ఇటీవల కొన్ని వార్తలు నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. కొన్ని వ్యాపారాలు ఎల్‌ఐసీకి సరెండర్ చేయడానికి బదులుగా ప్రస్తుత ఎల్‌ఐసీ పాలసీదారుల నుంచి పాలసీలను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నాయని వార్తలకు ప్రతిస్పందనగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) తన వైఖరిని స్పష్టం చేసింది . జీవిత బీమా బెహెమోత్ పాలసీదారులందరూ తమ కుటుంబ రిస్క్ కవరేజీని, ఆర్థిక స్థిరత్వాన్ని రాజీ పడేటటువంటి వారి పాలసీ గురించి ఏవైనా నిర్ణయాలు తీసుకునే ముందు చాలా జాగ్రత్త వహించాలని కోరింది. ఈ నేపథ్యంలో తాజా హెచ్చరికను ఎక్స్‌లో షేర్ చేసింది. ఎల్ఐసీ హెచ్చరికల గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.
పాలసీదారులందరి ప్రయోజనాల దృష్ట్యా ఎల్ఐసీ ఇటీవల విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఎల్ఐసీ ఎలాంటి సంస్థతో లేదా ఆయా సంస్థలు అందించే ఉత్పత్తులు మరియు/లేదా సేవలతో, ఏవైనా ప్రకటనలతో అనుబంధించలేదని స్పష్టం చేసింది. ముఖ్యంగా ఎల్ఐసీ మాజీ ఉద్యోగులు/ సిబ్బంది అలాంటి వ్యక్తులకు లేదా సంస్థలకు దూరంగా ఉండాలని కోరింది. ఆయా సంస్థలు తర్వాత ఏవైనా మోసాలు చేస్తే దానికి ఎల్ఐసీ బాధ్యత వహించదని పేర్కొంది. ముఖ్యంగా ఎల్ఐసీ పాలసీలకు సంబంధించి విక్రయం/బదిలీ లేదా అసైన్‌మెంట్ బీమా చట్టం, 1938కి అనుగుణంగా దానిలోని సెక్షన్ 38తో సహా చేపట్టాలనే విషయాన్ని పాలసీదారులు గుర్తుంచుకోవాలని కోరింది. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న వర్తించే చట్టాల ప్రకారం ఎల్ఐసీ ఏదైనా విక్రయం/బదిలీ లేదా పాలసీల కేటాయింపు చేస్తుందని మెసేజ్‌లు లేదా మెయిల్స్ వస్తే ఆయా లింక్స్‌ను క్లిక్ చేయవద్దని కోరింది. ముఖ్యంగా పాలసీల విక్రయం/బదిలీ లేదా అసైన్‌మెంట్ అనేది విశ్వసనీయమైన ప్లాట్‌ఫారమ్ కాదని గుర్తించాలని కోరింది. పాలసీదారునికి సంబంధించిన ప్రయోజనాలను ట్రేడింగ్ కోసం ఎల్ఐసీ ఎప్పుడు వాడదని గుర్తించాలని పేర్కొంది.
పాలసీదారులు ఏదైనా ఆఫర్‌లకు ప్రతిస్పందించే ముందు దాని అధికారులతో సంప్రదించాలని ఎల్‌ఐసీ తన పాలసీదారులను కోరింది. పాలసీ హోల్డర్‌లందరూ తమ పాలసీపై వారి ఆర్థిక భద్రత, వారి కుటుంబానికి రిస్క్ కవర్‌కు హాని కలిగించే ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు పూర్తి జాగ్రత్త వహించాలని సూచించింది. ఏదైనా ఆఫర్‌లకు ప్రతిస్పందించే ముందు దయచేసి మా బ్రాంచ్‌లలోని ఎల్ఐసీ అధికారులను సంప్రదించాలని కోరింది. ముఖ్యంగా ఎల్ఐసీ వెబ్‌సైట్ ప్రకారం మీకు ఎల్ఐసీ పాలసీ ఉంటే పాలసీ బాండ్‌ను సురక్షితంగా ఉంచుకోవాలని కోరింది. మెచ్యూరిటీ లేదా సర్వైవల్ బెనిఫిట్ సమయంలో ఇది చాలా అవసరమని పేర్కొంది.