చేతిలో స్మార్ట్‌ఫోన్ లేకపోతే రోజు గడవని పరిస్థితి వచ్చేసింది. దీంతో టెలికం కంపెనీలు సైతం యూజర్లను ఆకట్టుకునే విధంగా రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి.
ముఖ్యంగా నెల నెల రీఛార్జ్ చేసుకునే వారి కంటే ఒకేసారి ఏడాదికి రీఛార్జ్ చేసుకుంటే బిందాస్‌గా ఉండొచ్చనే వారి సంఖ్య పెరుగుతోంది. ఇందులో భాగంగానే ఏడాది వ్యాలిడిటీతో ప్రత్యేక రీఛార్జ్ ప్లాన్స్‌ను తీసుకొస్తున్నాయి. మరి దేశంలో ఉన్న రెండు ప్రధాన టెలికం సంస్థలైనా ఎయిర్‌టెల్, జియోలు అందిస్తోన్న కొన్ని బెస్ట్ వన్ ఇయర్ వ్యాలిడీటీ ప్యాకేజీలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
* ఏడాది వాలిడిటీతో జియో అందిస్తున్న బెస్ట్ ప్లాన్స్‌లో రూ. 1899 ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే 365 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. అయితే డేటా తక్కువ ఉపయోగించుకునే వారికి ఇది బెస్ట్ ప్లాన్‌గా చెప్పొచ్చు. ఇందులో ఏడాది మొత్తానికి గాను కేవలం 24 జీబీ మాత్రమే లభిస్తుంది.
* జియో అందిస్తోన్న మరో బెస్ట్ ప్లాన్స్‌లో రూ. 3599 ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాది వ్యాలిడిటీతో అన్‌లిమిడెట్ కాల్స్ పొందొచ్చు. రోజుకు 2.5 జీబీ డేటా పొందొచ్చు. రోజూ 100 ఎస్‌ఎమ్‌ఎస్‌లు ఉచితంగా పొందొచ్చు.
* రూ. 3999 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే రోజుకు 2.5 జీబీ డేటా పొందొచ్చు. ఈ జియో ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే.. ఏడాదిపాటు అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు.. జియో టీవీ కోసం ఫ్యాన్ కోడ్ పొందొచ్చు.
* మరో ప్రముఖ టెలికం సంస్థ ఎయిర్‌టెల్ అందిస్తున్న ప్లాన్స్‌లో రూ. 1999 ఒకటి. ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే ఏడాదిపాటు అన్‌లిమిటెడ్ కాల్స్ పొందొచ్చు. అయితే ఏడాది మొత్తానికి కలిపి 24 జీబీ డేటా పొందుతారు.
* ఎయిర్‌టెల్ రూ. 3599 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే. ఏడాది పాటు.. అన్‌లిమిటెడ్ కాల్స్‌తో పాటు.. అన్‌లిమిటెడ్ ఇంటర్నెట్‌ను పొందొచ్చు.
* ఎయిర్ టెల్ అందిస్తున్న రూ. 3999 ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకుంటే. ఏడాది పాటు హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్‌ను పొందొచ్చు. అలాగే ప్రతీ రోజూ 2.5 జీబీ డేటా పొందొచ్చు.