తక్కువ పెట్టుబడి.. కొంచెం బుద్ధిబలం.. లక్షల్లో ఆదాయం తెచ్చిపెట్టే వ్యాపారాలు ఇవే..

వేసవికాలం సీజన్లో తక్కువ పెట్టుబడితో కొత్త వ్యాపారం ప్రారంభించి మంచి లాభాలు పొందవచ్చు. వేసవికాలంలో మార్కెట్లో కొన్ని వస్తువులకు అలాగే కొన్ని సర్వీసులకు డిమాండ్ బాగా ఎక్కువగా ఉంది. ఈ వేసవి సీజన్లో ఇంటి దగ్గర నుంచే మీరు సులభంగా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారాన్ని చేయవచ్చు. వేసవికాలంలో కూలర్ లేదా ఏసి అద్దెకు తీసుకోవడం అనేది మంచి ఆదరణ పొందిన వ్యాపారం. పార్టీలు, చిన్నచిన్న ఆఫీసులు, పెన్షన్ హౌస్ లు, వివాహ వేడుకలో ఇలా ప్రతి దానికి కూడా ఈ వేసవి కాలంలో ఏసీలు లేదా కూలర్లు అవసరం అవుతాయి. కాబట్టి ఇటువంటి సందర్భాలలో మీరు తక్కువ ఖర్చుతో ఏసీ లేదా కూలర్ ను అద్దెకు ఇవ్వడం వలన మంచి ఆదాయం పొందవచ్చు. దీనికోసం మీరు ఎక్కువ పెట్టుబడి కూడా పెట్టాల్సిన అవసరం లేదు. మీ సామర్థ్యానికి తగినంత డబ్బు ఖర్చు చేసి కూలర్ లేదా ఏసీలు కొనుగోలు చేసి ఈ చిన్నపాటి వ్యాపారాన్ని మీరు ఇంటిదగ్గర నుంచే మొదలు పెట్టవచ్చు. ఈ వ్యాపారంలో మీరు ఎక్కువ లాభాలను పొందవచ్చు.


ఈ వేసవికాలంలో ఈ వ్యాపారానికి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. వేసవికాలంలో శుభకార్యాలు, పెళ్లిళ్లు వంటి వాటిలో ఐస్ క్యూబ్స్ కి బాగా డిమాండ్ ఉంటుంది. హోటల్స్, రెస్టారెంట్లలో కూడా ఐస్ క్యూబ్స్ చాలా అవసరం అవుతాయి. ఈ ఐస్ క్యూబ్స్ అమ్మడం వలన మీరు మంచి లాభాలను పొందవచ్చు. దీనికి కూడా ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు. ఈ వ్యాపారాన్ని మీరు ఒక చిన్న స్థలం ఏర్పాటు చేసుకుని ప్రభుత్వం నిబంధనలను పాటించి ఈ వ్యాపారానికి రిజిస్ట్రేషన్ చేయించుకుని ప్రారంభించవచ్చు. వేసవికాలంలో ఈ వ్యాపారానికి కూడా మార్కెట్లో బాగా డిమాండ్ ఉంది.

వేసవికాలంలో ప్రతి ఒక్కరు కూడా బయటకు వెళ్లేటప్పుడు సూర్యకిరణాల నుంచి తమను తాము కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో చాలామంది సన్ స్క్రీన్, సన్ గ్లాసెస్ వంటివి ఉపయోగిస్తారు. కాబట్టి వేసవికాలంలో సన్ స్క్రీన్ లేదా సన్ గ్లాసెస్ వంటివి అమ్మడం వలన కూడా మంచి లాభాలు పొందవచ్చు. ముఖ్యంగా ఏడాదిలో ఏప్రిల్ నుంచి ఆగస్టు నెల వరకు మార్కెట్లో ఈ వ్యాపారానికి గణనీయంగా డిమాండ్ ఉంది. మీరు చిన్న షాప్ ఏర్పాటు చేసుకొని సన్ స్క్రీన్ మరియు సన్ గ్లాసెస్ అమ్మడం వలన మంచి లాభాలు పొందవచ్చు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.