బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దక్షిణ, ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం ఈ అల్ప పీడనం ఏర్పడినట్టు భారత వాతావరణ శాఖ పేర్కొంది.
రానున్న 24 గంటల్లో ఇది మరింత బలహీనపడే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో 9వ తేదీ నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ప్రస్తుతం కోస్తా జిల్లాల్లో దట్టంగా మంచు కురుస్తుండగా.. ఇది మరో నాలుగు రోజులు కొనసాగే అవకాశం ఉందని IMD వెల్లడించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా మోస్తరుగా మంచు కురుస్తుందని తెలిపింది.



































