డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకంలో ఇకపై మెనూ జోన్ల వారీగా అమలుచేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి సెలవుల వరకు ట్రయల్ రన్ అమలుచేస్తారు. చివర్లో అభిప్రాయాలు సేకరించి మార్పులపై నిర్ణయం తీసుకుంటారు. జోన్ 1లో ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లాలు, జోన్ 2లో ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలు, జోన్ 3లో ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు, జోన్ 4లో ఉమ్మడి రాయలసీమ జిల్లాలు ఉంటాయి.
జోన్-1: సోమవారం- అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ; మంగళవారం-అన్నం, గుడ్డు కూర, రసం, రాగిజావ; బుధవారం- వెజ్ పలావు, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కీ; గురువారం- అన్నం, సాంబారు, గుడ్డు కూర, రాగిజావ; శుక్రవారం- పులిహోర, చట్నీ, ఉడికించిన గుడ్డు, చిక్కీ; శనివారం- అన్నం, కూరగాయల కూర, రసం, రాగి జావ, స్వీట్ పొంగలి.
జోన్-2: సోమవారం-అన్నం, కూరగాయలు లేదా ఆకుకూర పప్పు, ఫ్రైడ్ ఎగ్, చిక్కీ; మంగళవారం- పులిహోరా, ఉడికించిన గుడ్డు, చట్నీ, రాగిజావ; బుధవారం- అన్నం, మిక్స్‌డ్ వెజిటబుల్ కూర, ఫ్రైడ్ ఎగ్, చిక్కీ; గురువారం- కూరగాయల అన్నం లేదా వెజ్ పలావు, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగిజావ; శుక్రవారం- అన్నం, ఆకుకూర పప్పు, ఫ్రైడ్ ఎగ్, చిక్కీ; శనివారం- అన్నం, మిక్స్‌డ్ వెజిటబుల్ కూర, స్వీట్ పొంగలి, రాగి జావ.
జోన్-3: సోమవారం- అన్నం, సాంబారు, ఎగ్ ఫ్రై, చిక్కీ; మంగళవారం- పులిహోరా, టమాటా లేదా పుదీనా చట్నీ, ఫ్రైడ్ ఎగ్, రాగిజావ; బుధవారం- అన్నం, మిక్స్‌డ్ వెజిటబుల్ కూర, ఎగ్ ఫ్రై, చిక్కీ; గురువారం- వెజిటబుల్ అన్నం లేదా పలావు, ఆలూ కుర్మా, ఉడికించిన గుడ్డు, రాగి జావ; శుక్రవారం- అన్నం, గుడ్డు కూర, చిక్కీ; శనివారం- అన్నం, టమాటా పప్పు లేదా పప్పుచారు, స్వీట్ పొంగలి, రాగి జావ.
జోన్- 4: సోమవారం- అన్నం, వెజిటబుల్ కర్రీ, గుడ్డు, చిక్కీ; మంగళవారం- పులగం లేదా పులిహోర, వేరుశెనగ చట్నీ, ఉప్పుకారంతో గుడ్డు, రాగిజావ; బుధవారం- అన్నం, సాంబారు, గుడ్డు, చిక్కీ; గురువారం- వెజిటబుల్ రైస్, గుడ్డు కూర, రాగిజావ; శుక్రవారం- అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కీ; శనివారం- అన్నం, కందిపప్పుచారు, బెల్లం పొంగలి, రాగి జావ.