ఇటీవలంలో యువత మరీ డెంజర్ గా ప్రవర్తిస్తున్నారు. అసలు వాళ్లు ప్రవర్తిస్తున్న తీరును చూస్తుంటే మాత్రం ఆందోళలకు గురిచేస్తుందని చెప్పవచ్చు.
సోషల్ మీడియాల పిచ్చిలో పడి.. ఓవర్ నైట్లో ఫెమస్ అవ్వాలని డెంజరస్ స్టంట్ లు చేస్తున్నారు. రీల్స్, వీడియోలు, సెల్పీల మోజులో పడి అసలు వాళ్లు ఏం చేస్తున్నారో కూడా ఆలోచించుకోలేని స్థితికి చేరుకున్నారు.
మొత్తంగా ఇటీవల కొంత మంది యువత.. జలపాతాలు, సముద్రాలు, క్రూరజంతువులు మొదలైన ప్రదేశాలకు వెళ్లి రీల్స్ తీసుకుంటున్నారు. కొన్నిసార్లు వాళ్లు తీసుకుంటున్న రీల్స్ వల్ల పక్కన వాళ్లు కూడా ప్రమాదంలో చిక్కుకుంటున్నారు. మొత్తంగా సోషల్ మీడియాలో ఫెమస్ అయిపోవాలని వారి ప్రాణాల మీదకు కూడా తెచ్చుకుంటున్నారు.
ఈ క్రమంలో ఇప్పటికే చాలా మంది రన్నింగ్ ట్రైన్ ల ముందు రీల్స్ తీసుకుంటూ ప్రాణాలు కోల్పోయిన ఘటనలు కొకొల్లలు. రైల్వేశాఖ ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన, ఎంత కఠినంగా వ్యవహరించిన కూడా కొంతమంది యువతలో మాత్రం మార్పులు రావడంలేదు. తాజాగా… కొంత మందిమైనర్ యువకులు ఒడిషాలో రన్నింగ్ ట్రైన్ ముందు రీల్స్ తీసుకుంటూ డెంజరస్ స్టంట్ లు చేశారు.
ఒక బాలుడు రైల్వే పట్టాల మధ్యలో పడుకున్నాడు. మరో ఇద్దరు ఇతడ్ని వీడియో తీస్తున్నారు.మరోవైపు నుంచి ట్రైన్ స్పీడ్ గా వస్తుంది. అప్పుడు రైలు పట్టాల మీద పడుకున్న వ్యక్తి నుంచి రైల్ స్పీడ్ గా వెళ్లిపోయింది. ఈ ఘటనను అక్కడున్న వ్యక్తి తన ఫోన్ లో రికార్డు చేశాడు. రైలు వెళ్లిపొగానే.. గట్టిగా అరుస్తు అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్లు వాళ్లు అరుస్తు కేకలుపెట్టారు.
ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. మరీ బాలుడి లక్ బాగుందని ఏమికాలేదు… లేకుంటే.. ఎలాంటి ఘోరం చూడాల్సి వస్తుందో అని ఈ వీడియో చూస్తున్న వారు కంగారుపడుతున్నారు. మొత్తంగా ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.



































