ఆధార్ అనేది కేంద్ర ప్రభుత్వం అందించే విశిష్ట గుర్తింపు సంఖ్య. ప్రభుత్వం ప్రతి చిన్న అవసరానికి ఆధార్‌ను తప్పనిసరి చేసింది. ముఖ్యంగా ప్రభుత్వ పథకాల వర్తింపునకు ఆధార్ అవసరం అవుతుంది.
అంతేకాకుండా బ్యాంకు ఖాతాల నిర్వహణతో పాటు ఆర్థిక సంబంధిత కార్యకలాపాలకు కూడా ఆధార్ అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలో ఆధార్‌ను ప్రతి అవసరానికి గుర్తింపు కార్డుగా ఉపయోగించాల్సి వస్తుంది. ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్‌ఫోన్ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆధార్‌ను సింపుల్‌గా ఫోన్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. అలాగే ఆధార్ ఒరిజినల్‌లా ధ్రువీకరించుకోవచ్చు. ఆధార్‌ను జారీ చేసే భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఎం-ఆధార్‌ను తీసుకొచ్చింది. ఇది ఆధార్ కార్డునకు మొబైల్ యాప్ వెర్షన్‌ను సూచిస్తుంది. ఇది తప్పనిసరిగా మీ స్మార్ట్‌ఫోన్‌లో మీ ఆధార్ సమాచారాన్ని డిజిటల్‌గా తీసుకెళ్లడానికి, వివిధ ఆధార్ సంబంధిత సేవలను సౌకర్యవంతంగా ఉపయోగించుకోవడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఎం ఆధార్ గురించి వివరాలను తెలుసుకుందాం.
ఎం-ఆధార్ ఫీచర్లు
ఎం ఆధార్ ద్వారా మీ వ్యకతిగత సమాచారం, ఫోటోగ్రాఫ్, ఆధార్ నంబర్‌ను ఎప్పుడైనా ఎక్కడైనా యాక్సెస్ చేయండి.
బ్యాంకులు, టెలికాం ఆపరేటర్లు మొదలైన వాటి వద్ద ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ కోసం మీ ఫోన్‌ని ఉపయోగించవచ్చు.
ఎం ఆధార్ యాప్ దవఆరా మీ ఆధార్ కార్డునకు సంబంధించిన సురక్షితమైన, డిజిటల్ సంతకం చేసిన కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అలాగే ఈ యాప్‌లో మీ కుటుంబ సభ్యులకు సంబంధించిన ఐదుగురి ఆధార్ నంబర్‌లను లింక్ చేయవచ్చు.
మీ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ అందుబాటులో లేకపోతే ఆఫ్‌లైన్ ఆధార్ ప్రమాణీకరణ కోసం తాత్కాలిక పిన్‌ను సృష్టించవచ్చు.
ఎం ఆధార్ యాప్ ద్వారా నిర్వహించే మీ అన్ని ఆధార్ ఆధారిత ప్రమాణీకరణ లావాదేవీలను ట్రాక్ చేయండి.
ఎం ఆధార్ ప్రొఫైల్ క్రియేట్ చేయడం ఇలా
ఎం ఆధార్ యాప్‌ను ప్లే స్టోర్ లేదా ఐఓఎస్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.
అనంతరం యాప్‌ని తెరిచి “రిజిస్టర్ ఆధార్” ఎంపికను ఎంచుకోవాలి. మీ చెల్లుబాటు అయ్యే 12-అంకెల ఆధార్ నంబర్, అక్కడ కనిపించే క్యాప్చా కోడ్‌ను నమోదు చేయాలి.
ఎం ఆధార్ ప్రొఫైల్‌కు సురక్షితమైన యాక్సెస్ కోసం 4 అంకెల పిన్ లేదా పాస్‌వర్డ్‌ను సెట్ చేయాలి.
అనంతరం మీ ఆధార్‌తో లింక్ చేసిన మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయడానికి ఓటీపీను నమోదు చేయాలి.
ఒకసారి ఆధార్ నమోదు చేసుకున్న తర్వాత మీరు సృష్టించిన పిన్ లేదా పాస్‌వర్డ్‌ని ఉపయోగించి మీ ఎం-ఆధార్ ప్రొఫైల్‌ను యాక్సెస్ చేయవచ్చు.