ఇదేం మ్యాజిక్‌రా బాబు.. అరటి ఆకుపై గాల్లో ఎగురుతున్న కుర్రాడు..వీడియో చూస్తే అవాక్కే

ప్రస్తుతమంతా టెక్నాలజీ యుగం నడుస్తోంది. ఇంటర్‌ నెట్‌ వినియోగం విపరీతంగా పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ సోషల్‌ మీడియాలో ఫేమస్‌ కావాలని ఆరాటపడుతున్నారు.


చిత్ర విచిత్రమైన స్టంట్లు చేస్తున్నారు. తమను తాము వైరల్ చేసుకోవడానికి తమలోని టాలెంట్‌కు మరింత పదునుపెడుతున్నారు చాలా మంది. ఈ క్రమంలోనే ఇలాంటి ఓ వింత వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో ఒక వ్యక్తి తన ప్రతిభను అద్భుతంగా ప్రదర్శించాడు. ఇది చూసిన నెటిజన్లు పూర్తిగా షాక్ అయ్యారు. ఇలాంటి మ్యాజిక్ ఎలా సాధ్యం అనుకుంటూ అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

సైన్స్ సహాయంతో కొందరు మ్యాజిక్‌ లాంటి విన్యాసాలు చేస్తుంటారు. అది చూసి జనాలు ఆశ్చర్యపోవటం, చప్పట్లతో వారిని ప్రొత్సహించడం చేస్తుంటారు. అయితే కొంతమంది తమ చేతుల్లోని నైపుణ్యాన్ని చూపించే వీడియోలను సృష్టిస్తారు. అలాంటి వీడియోలు ఇంటర్నెట్ ప్రపంచంలోకి ప్రవేశించిన వెంటనే వైరల్ అవుతాయి. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వీడియో కూడా అలాంటిదే..అందులో ఒక వ్యక్తి అరటి ఆకు మీద స్వారీ చేస్తూ ఎగురుతున్నట్లుగా కనిపించింది. అయితే, ఇదంతా ఎలా సాధ్యం అని చాలా మంది షాక్‌ అవుతున్నారు.

వీడియోలో ఒక బాలుడు అరటి ఆకుపై స్వారీ చేస్తూ గాల్లో ఎగురుతున్నట్లుగా చూపిస్తూ వీడియో రికార్డ్‌ చేశారు. అతన్ని చూస్తుంటే తనేదో మ్యాజిక్ చేసినట్లుగా అనిపిస్తుంది. ఆ ఆకు అతనితో పాటు దానంతట అదే ఎగురుతున్నట్లు అనిపిస్తుంది. కానీ మీరు వీడియోను చివరి వరకు జాగ్రత్తగా చూస్తే, ఆ బాలుడు అరటి ఆకును అతని చెప్పులకు అంటించుకున్నాడు. అతడు రెండు చేతులతో ఓ బలమైన కర్రను పట్టుకుని ఉంటే.. అతని స్నేహితులు ఆ కర్ర సహాయంతో అతన్ని పైలేపారు.. అలాగే,..గాల్లో వేలాడదీస్తూ ముందుకు పరిగెత్తారు.. ఇదంతా తొలుత చూసేందుకు అతడు నిజంగానే గాల్లో ఎగురుతున్నట్టుగా కనిపించింది. ఇక్కడ కెమెరా పని చాలా బాగుందంటూ నెటిజన్లు భిన్నమైన కామెంట్లు చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.