జుట్టు రాలడం.. ఇప్పుడు ఇది ప్రతి ఒక్కరినీ వెంటాడుతున్న సమస్య. జుట్టు సమస్యలకు వయసుతో సంబంధంలేదు. చిన్నా పెద్దా అనే తేడా లేదు.. చిన్న వయసులోనే చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రాలిపోవడం,బట్టతల, తెల్ల వెంట్రుకల సమస్య ఎక్కవగా వేధిస్తోంది. దీనికి పరిష్కారం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ, మీరేప్పుడైన ఇంట్లో ఉండే టమాటా జ్యూస్ ట్రై చేశారా.. అవును మీరు విన్నది నిజమే..టమాటా రసంతో మీ రాలిపోయిన జుట్టు స్థానంలో తిరిగి వెంట్రుకలు పెరిగేలా చేసుకోవచ్చు అంటున్నారు నిపుణులు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం…
టమాటాలో అవసరమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వెంట్రుకలకు పోషణను అందిస్తాయి. జుట్టు కుదుళ్లను బలోపేతం చేస్తాయి. ఊడిపోతున్న జుట్టు స్థానంలో తిరిగి వెంట్రుకలు మొలిచేలా చేస్తాయి.
టమాటా పీహెచ్ స్థాయిలను అదుపులో ఉంచుతాయి. ఆక్సిడేటివ్స్ స్ట్రెస్ నుంచి కాపాడుతుంది. చుండ్రును తక్షణమే తగ్గించేస్తుంది. ఇందులో యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. టమాటా అప్లై చేయడం వల్ల జుట్టు హైడ్రేషన్ ఉంటుంది. దీంతో జుట్టు సమస్య రాదు. టమాట రసం నిమ్మరసం కలిపి జుట్టుకు అప్లై చేసి అరగంట తర్వాత తల స్నానం చేయాలి.
టమాటా రసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుంది. జుట్టు పెరుగుదలకు అత్యవసరమైన ప్రోటీన్ కొలాజెన్ ను అందిస్తుంది. టమాటాలో లైకోపీన్ ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని అడ్డుకుంటుంది. ఇది శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది.
అలాగే టమాటాలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. ఇది సెబమ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది ఆరోగ్యకరంగా జుట్టు పెరిగేలా చేస్తుంది. అలాగే టమాటా లో ఉండే బయోటిన్, జింక్ వంటివి జుట్టు బలాన్ని మెరుగుపరుస్తాయి. ఇవి జుట్టు పలుచబడకుండా తిరిగి పెరిగేలా చేస్తాయి.
టమాటాల్లో సహజమైన ఆమ్లాలు ఉంటాయి. ఇవి మాడు పీహెచ్ బ్యాలెన్స్ నిర్వహించడానికి ఉపయోగపడతాయి. చుండ్రును తగ్గించి జుట్టు తిరిగి పెరగడానికి మేలు చేస్తాయి. టమాటా ఉపయోగించడం వల్ల ఇందులో విటమిన్ సి హెయిర్ ఫొలికల్స్ బలంగా మారుస్తాయి. అంతేకాదు టమాటాలు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఫ్రీర్యాడికల్ డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి.
































