ఆ హీరోయిన్ తో మహేష్ బాబుకి ఎఫైర్..? నమ్రత ఎంట్రీతో సీన్ రివర్స్ అయింది

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్‌ చేసి, మరొకర్ని వివాహం చేసుకున్న వారే.అయితే తెలుగు స్టార్ హీరో మహేష్ బాబు కూడా ఓ హీరోయిన్‌తో ఎఫైర్ నడిపారని ఓ నిర్మాత షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళ్తే..


తెలుగు ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకం చెప్పాల్సిన పనిలేదు. కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు వంటి సూపర్ హిట్లతో ఆగ్ర స్థానానికి చేరువయ్యారాయన. మురారి, ఒక్కడు, అతడు, పోకిరి, దూకుడు, శ్రీమంతుడు , భరత్ అనే నేను, మహర్షి వంటి సూపర్ హిట్లతో ఆగ్ర స్థానానికి చేరువయ్యారాయన.

మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంతటి వాల్యూ ఇస్తారో అందరికి తెలిసిందే. సినిమా షూటింగ్‌కు గ్యాప్ దొరికితే చాలు ఫ్యామిలీతో కలిసి ఫారిన్ టూర్‌లకు చెక్కేస్తుంటారు. మహేష్ బాబు కంప్లీట్ ఫ్యామిలీ మ్యాన్ అంటూ చాలామంది హీరోయిన్లు చెప్పడం జరిగింది. అలాంటి మహేష్ బాబుపై నిర్మాత గీతా కృష్ణ షాకింగ్ కామెంట్స్ చేశారు. మహేష్ బాబు హీరోయిన్ త్రిషతో సీక్రెట్ ఎఫైర్ నడిపించారని నిర్మాత గీతా కృష్ణ బాంబు పేల్చారు. త్రిష కోసం మహేష్ ముంబై కూడా వెళ్లేవాడని ఆయన తెలిపారు.ఓ రోజు ఈ విషయాన్ని మహేష్ బాబు భార్య నమ్రత కనిపెట్టి ఎంతో చాకచక్యంగా ఇష్యూ క్లోజ్ చేసిందని చెప్పుకొచ్చాడు. త్రిష , మహేష్ బాబు కాంబినేషన్‌లో రెండు సినిమాలు వచ్చాయి. అతడు, సైనికుడు సినిమాల్లో వీరిద్దరు కలిసి నటించారు.

అతడు బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కాగ, సైనికుడు సినిమా ఫ్లాప్‌గా నిలిచింది. ఆ తర్వాత వీరిద్దరు కలిసి నటించలేదు. అయితే మహేష్ బాబుపై నిర్మాత గీతా కృష్ణ చేసిన కామెంట్స్ ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహేష్ ఎలాంటి వారో అందరికి తెలుసునని, ఇలాంటి వారు టీవీల్లో కనిపించడనికి, వ్యూస్ రావడానికి ఏదో ఒకటి చెబుతుంటారని, వీరి గురించి పట్టించుకోవాల్సిన పని లేదని అంటున్నారు.