Mahindra Thar కార్ల ధరలకు రెక్కలు.. బేస్ వేరియంట్లపై భారీగా పెంపు..

మహింద్రా థార్ కు దేశంలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ కారు అమ్మకాలలో దూసుకుపోతూ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. దేశీయ తయారీ సంస్థ మహింద్రా నుంచి విడుదలైన ఈ కారు మంచి డిజైన్, అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకుంటుంది. అయితే మార్కెట్ లోని కొన్ని థార్ బేస్ వేరియంట్ల ధరలు పెరిగాయి. పాత ధరకు రూ.10 వేల వరకూ ఎక్కువగా మారాయి. పెరిగిన మార్పులలో ఈ కారు రూ.11.35 లక్షల (ఎక్స్ షోరూమ్) ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది.


Brand expansion..
మహింద్రా కంపెనీ మార్కెట్లో తన బ్రాండ్ ను విస్తరించేందుకు అనేక చర్యలు తీసుకుంటోంది. లేటెస్త్ ఫీచర్లతో వినియోగదారులకు అవసరమైన విధంగా కార్లను రూపొందిస్తోంది. ఇందులో భాగంగా ఎస్ యూవీ సిగ్మెంట్ లో ఎక్స్ యూవీ 3ఎక్స్ ఓ కారును విడుదల చేసింది. అలాగే తన ప్రసిద్ధ థార్ ధరలను సవరించింది. కొన్ని బేస్ వేరియంట్లపై రూ.10 వేలు పెంచింది. ఈ మార్పులతో ఈ కారు ధర 11.35 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. అలాగే అత్యంత ఖరీదైన వేరియంట్ రూ. 17.6 లక్షలుగా ఉంది.

These are the base variants where the price has increased..

మహింద్రా సంస్థ ఈ కింది తెలిపిన బేస్ వేరియంట్ల ధరను రూ.పదివేలకు పెంచింది. వీటిలో ఏఎక్స్ (ఓ) డీజిల్ ఎంటీ ఆర్ డబ్ల్యూడీ, ఎల్ ఎక్స్ డీజిల్ ఎంటీ ఆర్ డబ్ల్యూడీ, ఎల్ ఎక్స్ పెట్రోల్ డబ్ల్యూడీ ఉన్నాయి. పెరిగిన ధరలతో ఇవి వరుసగా 11.35 లక్షలు, 12.85 లక్షలు, 14.1 లక్షలకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ఎక్స్ షోరూమ్ ధరలు. ఇతర వేరియంట్ల ధరలు మాత్రం ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి.

ఇంజిన్ సామర్థ్యం..
దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో మహింద్రా థార్ ఒకటి. సాధారణ వినియోగంతో పాటు ఆఫ్ రోడింగ్ చేయడానికి కూడా ఈ కారు అద్బుతంగా ఉంటుంది. ప్రస్తుతం మార్కెట్ లోని మారుతీ సుజుకీ జిమ్నీ, ఫోర్స్ గుర్కా తదితర కార్లతో పోటీ పడుతుంది. థార్ కార్లు 1 పెట్రోల్, 2 డీజిల్ ఇంజన్ ఎంపికలతో అందుబాటులోకి వచ్చాయి. 1.5 లీటర్ సీఆర్ డీఈ డీజిల్, 2.0 లీటర్ టీజీడీఐ పెట్రోల్ ఇంజన్ సామర్థ్యంతో పనిచేస్తాయి.

త్వరలో కొత్త ఆవిష్కరణ..
మహింద్రా కంపెనీ మరో కొత్త ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తోంది. థార్ లో ఫైవ్ డోర్ వెర్షన్ ను విడుదల చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ కొత్త ఎస్ యూవీకి ఇంకా పేరు పెట్టలేదు. అయితే మార్కెట్ నిపుణుల అంచనా ప్రకారం.. కొత్త కారుకు ఆర్మ్ డా అని పేరు పెట్టే అవకాశం ఉంది. అలాగే ఈ ఏడాది ఆగస్టు 15 న భారతీయ మార్కెట్లో విడుదల చేస్తారని భావిస్తున్నారు. కానీ దీనిపై ఇంత వరకూ మహింద్రా అధికారంగా ఏ ప్రకటనా చేయలేదు.

పెరిగిన డిమాండ్..
మహింద్రా థార్ కార్లకు ఈ ఏడాది డిమాండ్ బాగా ఏర్పడింది. కార్ల కోసం బుక్కింగ్ లు విపరీతంగా పెరిగాయి. ఫిబ్రవరి నాటికే 7100 బుక్కింగ్ లు జరిగినట్టు సమాచారం. థార్ కోసం వెయిటింగ్ పిరియడ్ ఆరు వారాలకంటే ఎక్కువగా ఉంటోంది. సాధ్యమైనంత వరకూ వినియోగదారులకు వేగంగా డెలివరీ చేసేందుకు మహింద్రా ప్రయత్నిస్తోంది.